Home వార్తలు Supreme Court: సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం

Supreme Court: సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం

Supreme Court: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితం జస్టిస్ చంద్రచూడ్ చే రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండు సంవత్సరాల పాటు సీజేఐ గా సేవలు అందించనున్నారు. 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ యుయు లలిత్ కేవలం 74 రోజులు మాత్రమే సేవలు అందించారు.

జస్టిస్ చంద్రచూడ్ 1998 లో అదనపు సోలిసిటర్ జనరల్ గా పని చేశారు. 2016 మే 13 నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అంతకు ముందు ఆయన అలహాబాద్, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. దేశంలోనే కీలక కేసులుగా పరిగణించిన అయోధ్య, శబరిమల, అనంత పద్మనాభస్వామి ఆలయం, సెక్షన్ 377, గర్బ విచ్చిత్తి వంటి కేసుల్లో జస్టిస్ చంద్రచూడ్ కీలక తీర్పులు ఇచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దాదాపు ఏడు సంవత్సరాల పాటు సేవలు అందించారు.

Exit mobile version