Home వార్తలు నేపాల్ లో భారీ భూకంపం ..ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ప్రభావం

నేపాల్ లో భారీ భూకంపం ..ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ప్రభావం

earthquake

నేపాల్ లో గత రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో భవనాలు కూలి ఆరుగురు మృతి చెందారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.6 గా నమోదు అయ్యింది. గత రాత్రి గంటల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించింది. రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, అర్ధరాత్రి దాటిన తర్వాత మరింత తీవ్రతతో భూమి కంపించింది. నేపాల్ లోని దిపయాల్ కు 21 కిలో మీటర్ల దూరంలో భూమికి 10 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేపాల్ జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. ఈ భూకంపం ప్రభావం కారణంగా దోతి జిల్లాలో ఇల్లుకూలి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. మరి కొంత మంది గాయపడ్డారు. ఆస్తినష్టం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నేపాల్ భూకంప ప్రభావంతో ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాలైన గజియాబాద్, గురుగ్రామ్, లక్నో తో పాటు తదితర ప్రాంతాల్లో 20 సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.7గా నమోదు అయ్యింది. ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ కు సమీపంలోని హిమాలయ ప్రాంతంలో రాత్రి 1.57 గంటలకు భూకంపం ఏర్పడింది. ప్రజలు అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు రావడంతో భయాందోళనలకు గురి అయ్యారు. ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసారు.

Exit mobile version