Home వార్తలు న్యాయానికి…నేరానికి మధ్యనే ఎన్నికలు : వైయస్ షర్మిల

న్యాయానికి…నేరానికి మధ్యనే ఎన్నికలు : వైయస్ షర్మిల

వివేకానంద రెడ్డి రక్తం కళ్ళ చూసిన ఎంపి.అవినాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేయటం వలనే తాను కడప పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు. న్యాయానికి, నేరానికి..ధర్మానికి , డబ్బుకి మధ్యనే కడప పార్లమెంట్ ఎన్నిక జరుగుతుందని అన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోతే నేరం గెలిచినట్లె అని స్పష్టం చేశారు. మంగళవారం గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…సిబిఐ చార్జిషీట్ లో నిందితుడుగా పేర్కొన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎలా పోటీ చేయిస్తున్నారు అని ప్రశ్నించారు. హత్య జరిగితే సాక్షి మీడియాలో హార్ట్ ఎటాక్ అని ఎలా చెప్పారో కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డి హత్య చేయలేదు…కేవలం సాక్ష్యాలను చేరిపివేస్తుంటే చూసారని వైకాపా నేతలే చెప్తున్నారు. అలాంటి వ్యక్తిని ఐదేళ్లుగా ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. ప్రధాని మోదీకి అన్నీ విషయాలలో మద్దతు తెలుపుతున్న జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ వారసుడు ఎలా అవుతారు. జగన్ రీమోట్ ఇంట్లో భారతీ చేతిలో కేంద్రంలో మోదీ చేతిలో ఉంది అని ఎద్దేవా చేశారు.

జగన్మోహన్ రెడ్డివి ముఖస్తుతి మాటలు

తాను కడప పార్లమెంట్ ఎన్నికల్లో ఒడిపోతానని …. ఒక అన్నగా చాలా భాధగా ఉందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా తను గెలుపును కోరుకునే వారైతే అవినాష్ రెడ్డిని పోటీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఓడిపోయినప్పుడు మీరు నిజంగా బాధపడ్డారా? చిన్నాన్న ను ఓడించింది భాస్కర్ రెడ్డి ,మనోహర్ రెడ్డిలు కాదా అని ప్రశ్నించారు. తన పోటీ పై ఎందుకు బయపడుతున్నారు. నన్ను ఓడించడానికి ఎందుకు వైయస్ కుటుంబాన్ని మొత్తాన్ని దించుతున్నారని ప్రశ్నించారు.తనపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముఖస్తుతి మాటలని విమర్శించారు.

Exit mobile version