Home వార్తలు కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం – పంచాయతీ కార్యదర్శిపై వేటు

కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం – పంచాయతీ కార్యదర్శిపై వేటు

కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగం నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరం పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. గన్నవరం పంచాయతీ కార్యదర్శి నక్క రాజేంద్ర వరప్రసాద్ పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ కోన శశిధర్ సోమవారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు డిపిఓ నాగేశ్వరరావు ఉత్తర్వులు విడుదల చేశారు గన్నవరం పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్ పలువురు వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు జిల్లా కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదులు అందజేయడంతో గన్నవరం పంచాయతీ కార్యాలయంలో గుడివాడ డిఎల్ పీఓ పలువురు అధికారులతో కలిసి ఇటీవల విచారణ జరిపారు.

ఈ విచారణలో పంచాయతీ నిధులు ఒక కోటి 58 లక్షలు దుర్వినియోగం అయినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ ను విదుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ సాధారణ నిధులతో పాటు ఇతర నిధులు బోర్డు అనుమతి లేకుండా ఖర్చు చేసినట్లుగా అధికారులు గుర్తించారు.

Exit mobile version