Home వార్తలు అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. భూయాజమాన్య హక్కులను రెవిన్యూ అధికారులు నిర్ణయించకుడదన్న సుప్రీం కోర్టు తీర్పుకు చట్టం విరుద్ధమని మండిపడ్డారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 21, 246,300 లకు విరుద్ధంగా చట్టాన్ని తయారు చేశారని విరుచుకుపడ్డారు. శుక్రవారం మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం అడ్డగోలుగా ముందుకు వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా వైసిపి నాయకుల భూ కబ్జాలు భరించలేక కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో సుబ్బారావు తన కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రామాయపట్నం లో ఇండోసోల్ కు కారు చౌకగా 8500 ఎకరాలు కట్టబెట్టారని దుయ్యబట్టారు.

చట్టం వలన భూముల మిద రైతు హక్కులను..పౌరులుఆస్తి హక్కులును కోల్పోతారని పేర్కొన్నారు. చట్టంలో సెక్షన్ 5 ప్రకారం ఎవర్ని అయిన టి.ఆర్.ఓ ( టైటీలింగ్ రీసర్చ్ ఆఫీసర్ ) గా నియమించేందుకు అవకాశం కల్పించారని ధ్వజమెత్తారు.భూ వివాదాల్లో 533 సివిల్ కోర్టు అధికారాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం అవి అన్ని రద్దు అయ్యాయని వెల్లడించారు. సివిల్ జడ్జికి అధికారాలను న్యాయ పరిజ్ఞానం లేని రెవిన్యూ అధికారాలకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు.కేసు రాసిన పోలీసులే తీర్పు ఇచ్చే విధంగా చట్టం తయారు చేశారని విరుచుకుపడ్డారు. రెవిన్యూ రికార్డులో భూ యజమాని పేరు మార్పుకు సంబంధించి వారికి నోటీసులు అందించే సెక్షన్ ను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార వైసిపి నాయకులు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చి అప్లైడ్ ట్రిబ్యునల్ లో వ్యవసాయ భూములను వారు పేర్ల మీద నమోదు చేసుకునేందుకు చట్టం చేశారని తెలిపారు. రైతులు కోర్టులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చట్టం రూపొందించారని విమర్శించారు. చట్టసభల్లో మంద బలం ఉందనే విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకి పిలుపునిచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మీడియాను కోరారు.

Exit mobile version