Home వార్తలు పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27 న ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోపార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేముల పాటి అజయ్ కుమార్ ప్రచార వివరాలను వెల్లడించారు.శనివారం మధ్యాహ్నం గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో, లో వరుణ్ తేజ్ ప్రసంగిస్తారని తెలిపారు.జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల కార్యకర్తలు అభిమానులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పంచకర్ల సందీప్,జ్యోతుల శ్రీనివాస్,పిల్లా శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version