Home వార్తలు రైతుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్

రైతుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్

వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రబీ 2020 – 21, ఖరీఫ్ 2021 సీజన్లకు చెెందిన వైెస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్ – 2022 సీజన్ లో వివిధ రకాల వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ తో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ గడచిన మూడేళ్లలో 20.85 లక్షల మంది రైతులకు రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమ చేయగా, తాజాా గా జమ చేసిన మొత్తం 21.31 లక్షల మంది రైతులకు రూ.1,834,79 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ జమ చేసినట్లు అవుతుందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతులు మద్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా ఫరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి ఉండేదని అన్నారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరి కొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించే వారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఈ క్రాప్ ఆధారంగా నమోదైన వాస్తవ సాగు దారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు. అంతే కాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్ ఆడిట్ కింద రైతు భరోసా కేంద్రాల్లో లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించడమే కాదు, అర్హత ఉండి జాబితాల్లో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించామని సీఎం జగన్ తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు న్యాయం జరుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి రైతులు తేడా ను గమనించాలని విజ్ఢప్తి చేశారు, మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎప్పుడూ ఉంటాయని జగన్ పేర్కొన్నారు.

Exit mobile version