Home వార్తలు iphone12: 13 వేల తగ్గింపుతో ఐ ఫోన్.. ప్లిప్ కార్టులో భారీ ఆఫర్..!!

iphone12: 13 వేల తగ్గింపుతో ఐ ఫోన్.. ప్లిప్ కార్టులో భారీ ఆఫర్..!!


iphone12: ఫిప్ కార్టు స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్ లో ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు అందించారు,. ఈ నెల 8వ తేదీ వరకూ ఈ విక్రయాలు జరగనున్నాయి. ఐఫోన్ 12లో ఓఎల్ఈడీ డిస్ ప్లే ను అందించారు. ఇందులో 5 జీ సపోర్టు కూడా కంపెనీ అందించింది., ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉన్నాయి.

ఐ ఫోన్ 12 స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ లో రూ.66,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర 79,900లు కాగా ఇప్పుడు రూ.12,901 వేల తగ్గింపుతో లభిస్తోంది. గతంలో జరిగిన విక్రయాల్లో ఈ ఫోన్ పై 9వేల రూపాయల డిస్కౌంట్ అందించగా ఇప్పుడు ఏకంగా 13వేల వరకూ వరకూ తగ్గింపును అందించారు.


ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల డిస్ ప్లేను యాపిల్ అందించింది. ఏ 14 బయోనిక్ చిప్ పైనే ఈ ఫోన్ కూడా పని చేయనుంది. 5 జీ సపోర్టు కూడా ఇందులో కంపెనీ అందించనుంది. 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలోనే ఈ ఫోన్ కూడా కొనుగోలు చేయవచ్చు. 17 గంటల వీడియో ప్లేబ్యాక్ ను ఈ ఫోన్ అందిస్తుంది. ఈ ఫోన్ మందం కేవలం 0.74 సెంటీ మీటర్లు మాత్రమే ఉండగా, బరువు 164 గ్రాములుగా ఉంది. ఐవోఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ ఫోన్ పని చేయనుంది. మరో విషయం ఏమిటంటే ఐ ఫోన్ 13 సిరీస్ కూడా ఈ నెలలో మార్కెట్ లోకి లాంచ్ అవ్వనుండగా ఐ ఫోన్ 12 సిరీస్ ధరలు త్వరలో మరింత తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Exit mobile version