Home వార్తలు Divyavani: టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి రాజీనామా ట్విస్ట్ ..?

Divyavani: టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి రాజీనామా ట్విస్ట్ ..?

Divyavani: టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి రాజీనామాలో ట్విస్ట్ చోటుచేసుకుంది. తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన దివ్యవాణి కొద్ది సేపటికే ఈ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఒంగోలులో జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్న ఆనందంలో ఉన్న టీడీపీకి దివ్యవాణి ఊహించని షాక్ ఇస్తూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి తెలిపారు. ఇంత వరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. మహానాడులో దివ్యవాణికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె మనస్థాపానికి గురైయ్యారు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో తనకు అవమానం జరిగినట్లుగా దివ్యవాణి భావిస్తున్నారు. ఇదే విషయాలను దివ్యవాణి సోమవారం ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తాను టీడీపీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్నా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు దివ్యవాణి. ఒక కళాకారుడు (ఎన్టీఆర్) పెట్టిన పార్టీలో కళాకారులకు సరైన స్థానం లేకపోవడం తనని ఆవేదనకు గురి చేస్తొందని ఆమె పేర్కొన్నారు. దివ్యవాణి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. టీడీపీ అధికార ప్రతినిధిగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేసిన దివ్యవాణి.. తన రాజీనామాకు సంబంధించిన ట్వీట్ ను డిలీట్ చేయడం ఆశక్తికరంగా మారింది.  

Exit mobile version