Home వార్తలు ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఆదివారం విశాఖపట్టణంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ పేరును చార్జిషీట్‌లో పెట్టించినందుకే పొన్నవోలుకి ఏఏజీ పదవి దక్కిందని ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోతే హడావుడిగా ఏఏజీ పదవిని ఎందుకు ఇచ్చారని నిలదీశారు. తాను చేసిన వ్యాఖ్యల్ని ఖండించకుండా బుజాలు తడుముకుంటూ పొన్నవోలు నిజాలే చెప్తున్నారు. ఈయన ఏమీ న్యాయవాదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని మర్చిపోయి నన్ను ఏక వచనంతో విమర్శిస్తూ పొన్నవోలు జగన్ పై స్వామి భక్తిని కనపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమాస్తుల కేసులో తొలుత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును సీబీఐ చేర్చలేదని తెలిపారు. ఆ తర్వాత జగన్‌ ఆదేశాలతోనే ఎఫ్‌ఐఆర్‌లోకి ఆయన పేరు చేర్చబడిందిని పేర్కొన్నారు. జగన్ అదేశాలతోనే పొన్నవోలు సుధాకర్‌రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చారని అన్నారు. కేసు నుంచి జగన్‌ను బయటపడేసేందుకు పోన్నవోలు ఈ ప్రయత్నం చేశారని వివరించారు. రాజశేఖర్ రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కేసు నుంచి బయటపడటం అసాధ్యమని ఆయన భావించారన్నారు. అందులో భాగంగానే పేరు చేర్చాలని సిబిఐ ట్రైల్ కోర్టు,హైకోర్ట్, సుప్రీం కోర్టు వరకు వెళ్లారన్నారు.ఒక వైపు రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానమని చెప్తూనే….మరోవైపు ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా కోర్టులు చుట్టూ ఎందుకు తిరిగారని ప్రశ్నించారు.

Exit mobile version