Home వార్తలు రక్తం ఏరులై పారితే …సాక్షిలో హార్ట్ ఎటాక్ అని ఎలా చెప్పారు ? : షర్మిల

రక్తం ఏరులై పారితే …సాక్షిలో హార్ట్ ఎటాక్ అని ఎలా చెప్పారు ? : షర్మిల

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు గురై ఇంట్లో రక్తం ఎరులు అయ్యి పారితే …హార్ట్ ఎటాక్ అని సాక్షి చానెల్ లో ఏ విధంగా చెప్పారు.? సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారు? ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి , అధికారం వచ్చిన తరువాత విచారణ ఎందుకు అవసరం లేదని అన్నారో కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిళ డిమాండ్ చేశారు. శనివారం కడప పార్లమెంట్ పరిధిలో బస్ యాత్ర లో ఆమె మాట్లాడుతూ..హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారికి ఓట్లు వేయకూడదన్న నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. వైసిపి తరుపున కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అవినాష్ రెడ్డిని అడ్డుకునేందుకే తాను బరిలోకి దిగినట్లు ఆమె తెలిపారు. రాబోయే ఎన్నికల్లో న్యాయానికి అధికారానికి , ధర్మానికి ,డబ్బుకు మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు.

బిజెపికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బానిస అయ్యారు?

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముస్లిం లను ఎంత ప్రేమించారో…బీజీపీ ని అంత వ్యతిరేకించేవారు. బిజెపి ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టీ ఆ మంటల్లో చలి కాచుకొనేది బీజీపీ అని మండిపడ్డారు. గోద్రా అల్లర్ల పై ముస్లిం మిద దాడులకు వ్యతిరేఖంగా రాజశేఖర్ రెడ్డి పోరాడితే…..మణిపూర్ లో మైనార్టీ నాయకులు మిద జరిగిన దాడులపై జగన్మోహన్ రెడ్డి నోరు అయినా విప్పారా అని నిలదీశారు.

Exit mobile version