Saturday, April 27, 2024
Home వార్తలు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు సేవకుడిగా సిద్ధం : జగన్మోహన్ రెడ్డి

ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు సేవకుడిగా సిద్ధం : జగన్మోహన్ రెడ్డి

- Advertisement -

జగన్ వస్తాడు మంచి రోజులు తెస్తాడు అని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చాను…రానున్న ఎన్నికలకు ఒక్కటి చేపదలచుకున్నా. పేదవాడి భవిష్యత్ బాగుపడాలి,ఐదేళ్లుగా జరుగుతున్న మంచి కొనసాగాలి అంటే మళ్ళీ జగన్నన్నే తెచ్చుకుందామని, మళ్ళీ అన్నను తెచ్చుకుందాం..ఇంకా మంచి కార్యక్రమాలు జరిపించుకుందాం అని ప్రతి ఇంటికి,ప్రతి గడపకు వెళ్ళి వైసిపి నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైసిపి ఎన్నికల శంఖారావం చివరి సిద్ధం సభకు ఆయన హాజరు అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లగా వైసిపి పాలనలో ప్రతి ఇంటికి మంచి జరగకపోతే, మేనిఫెస్టో లో చెప్పిందంతా చేయకపోతే జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించకుంటే ఇంతమంది తో పొత్తులు కోసం ఎందుకు చంద్రబాబు పాకులాడుతున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర ధర్మ యుద్ధంలో రాష్ట్ర ప్రజలది శ్రీ కృష్ణుడి ది పాత్ర అని, జగన్మోహన్ రెడ్డిది అర్జునుడు పాత్ర అని పేర్కొన్నారు. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని … రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడుతున్న పెత్తందారులు మీద ప్రయోగించాలసిన సమయం వచ్చింది అని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతు తెలిపే మాదిరిగా తనకు పొలిటికల్ స్టార్స్ లేరు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 మీడియాలు లేవు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు…ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నా నాకు….ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో, అంతమంది పేదింటి స్టార్ట్ క్యాంపెయిన్ లు ప్రతి ఇంట్లో , ప్రతి గడపలో ఉన్నారన్నారు. జనసేన బీజీపీ లతో చంద్రబాబు పొత్తులో ఉన్నారు.మరో జాతీయ పార్టీ కూడా చంద్రబాబు జేబులో ఉంది.వీరంతా పేదల భవిష్యత్తు మీద దాడి చేయటానికి సిద్దంగా ఉన్నారని విమర్శించారు.

- Advertisement -

సైన్యాధిపతులు తప్ప సైన్యం లేదు

- Advertisement -

రానున్న ఎన్నికల్లో టిడిపి,జనసేన ,బీజీపీ ల పార్టీలలో సైన్యాధిపతి లు తప్పా…. ఏ పార్టీలో కూడా ఎక్కడా సైన్యం లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో కొన్ని పార్టీలకు నోటా కి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ రాలేదు.తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టి పార్టీలు. ప్రజల చేతిలో చిత్తుగా ఒడిపోయిన పార్టీల ఎన్నికలో తనకు పోటీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఐదు కోట్ల ప్రజల అండదండలతో ఇంటికింకి మంచి చేసి సిద్ధం అంటుంటే…వారి వెనుక మంచి లేదు కాబట్టి చేసిన మంచి చెప్పుకొనే పరిస్థితి లేదు కాబట్టి , అరడజను పార్టీలతో…అరడజను యెల్లో మీడియా సంస్థలతో పొత్తులతోను,ఎత్తులతోను జిత్తులతోను, ఎక్కేగుమ్మం..దిగే గుమ్మంగా …రాజకీయం నడుపుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

- Advertisement -

ఉదరగొట్టే చంద్రబాబు కు పొత్తులు ఎందుకు ?

జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని ప్రధానిని, రాష్ట్రపతిని తానే నిర్ణయించనని చంద్రబాబు ఉదరగొట్టేవారని విమర్శించారు.రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వలన ,ఇంటింటి కు చేసిన మంచి వలన …మనకు ఉన్న ప్రజా బలం ముందు నిలబడలేక మనతో నేరుగా తలబడలేక ఏపిలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని , ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడుతో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీ లో బీజీపీ పెద్దల ముందర మొకరిలుతున్నారని ధ్వజమెత్తారు.

2014 ఎన్నికల హామీలు ఏమయ్యాయి ?

గతంలో టిడిపి,జనసేన, బీజీపీ పొత్తు పెట్టుకొని ప్రతేక హోదా తెచ్చారా? రాష్ట్రానికి ఏమి చేయకుండా మేనిఫెస్టో అని చెప్పి, .ఏమీ చేయకుండా మరోసారి అదే డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గతం కన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మళ్ళీ పొత్తుల డ్రామతో అందరి ముందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పోత్తులతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా అని ప్రశ్నించారు. ప్రజలకు ఏ ఒక్కరికి మంచి చేయకపోయినా ప్రజలకు మంచి చేసిన జగన్ ను టార్గెట్ చేయటమే వారి ఏకైక అజెండాగా కనిపిస్తుందినీ మండిపడ్డారు. దోచుకునేందుకు, పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబు కు అధికారం కావాలని విమర్శించారు.

జగన్ మార్క్ రాజకీయంలో విశ్వసనీయతకు పట్టం

వైసిపి ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళి ఐదేళ్లలో చేసిన మంచిని చెబుతూ తిరుగుతుంటే…..చంద్రబాబు మాత్రం రామోజీరావు, ఆంధ్రజ్యోతి,ఢిల్లీ లో ఇతర పార్టీల గడపలు ఇలా అరడజను గడపలు ఐదేళ్లుగా తన మనుషులను పంపి తిరుగుతున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇది జగన్ మార్క్ రాజకీయం కనిపిస్తుంది అని పేర్కొన్నారు. జగన్ మార్క్ రాజకీయంలో విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం,నిబద్ధత ,సిద్ధాంత బలం ఉంది అని పేర్కొన్నారు.వైసిపి పాలనకు ఇంటింటికీ మంచి చేశామన్న చరిత్ర ఉంది..అక్క చెళ్ళమ్మల మీద నమ్మకం ఉంది..ఈరోజు మీ బిడ్డ పాలనతో చిక్కని చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి..జగన్ మార్క్ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కనిపిస్తుంది

ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంట్ ఇతర పార్టీల నుంచి, ఇతరులతో పొత్తుల వలన వచ్చింది కాదు.నేరుగా ప్రజల ఆశీర్వదిస్తే వస్తుంది, అని పేర్కొన్నారు. లంచాలు లేని వివక్ష లేని పాలన ఎవరైనా ఐదు సంవత్సరాల కిందట ఇవ్వగలుగుతారా ఆశ్చర్యం పరిస్థితి నుంచి… లంచాలు లేని వివక్ష లేని పాలనను మనం అందించిన దానిలో నుంచి కరెంట్ వస్తుంది అని పేర్కొన్నారు.

టిడిపి సైకిల్ కు టైర్లు తుప్పుపట్టిన పరిస్థితిలో ఉంది… తుప్పుపట్టిన సైకిల్ ను తోక్కటానికి తోయ్యటానికి చంద్రబాబు కు వేరే పార్టీలు కావాలి….ఇది చంద్రబాబు జాబ్ రిక్వైర్మెంట్స్ అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక మంచి కూడా వినపడదు.. చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా కనిపించదు….అందుకే పొత్తులో బాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్త పుత్రుడు ని తెచ్చుకున్నారు. ప్యాకేజీ స్టార్ ఐతే సైకిల్ సిట్ అడగడు..తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా అడగడు….ఎందుకు తక్కువ సీట్లు ఇస్తున్నావని ప్రశ్నించరు. కావాలంటే తాను తాగుతున్న టీ గ్లాస్ ను కూడా బాబు కే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే సిట్..స్టాండ్ అంటే స్టాండ్ అన్న విధంగా చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోత్తులతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా అని ప్రశ్నించారు.

ఈ ఎన్నికలు పేదవాడి భవిష్యత్ కు కీలకం

ఈ 58 నెలల్లో 130 సార్లు బటన్ నొక్కి దాదాపు 2 ,70,000 కోట్ల రూపాయలు డిబిటి ద్వారా అందించాము అని పేర్కొన్నారు. ఐదేళ్లుగా ఇస్తున్న పథకాలు కొనసాగాలంటే..ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయిన్ ర్ కావాలని కోరారు. పొరపాటు జరిగితే పేదవాడి భవిషత్తు అంధకారం అవుతుంది అని ఇంటింటికీ తిరిగి చెప్పాలి. పార్టీ కార్యకర్తలు…అభిమానులు వాలంటీర్లు పాత్ర ఎంతో కీలకం అని తెలిపారు ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే ఐదు సంవత్సరాల్లో వారి భవిష్యత్తును ఎలా మారుస్తుందొ వివరించటం చాలా అవసరం. వైసిపి ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాం….చంద్రబాబు అనే మాయలోడి వల్లో పడవద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

Most Popular

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...