Home వార్తలు CM Tour Ongole: ఎల్లుండి సీఎం పర్యటన సాగేదిలా..!

CM Tour Ongole: ఎల్లుండి సీఎం పర్యటన సాగేదిలా..!

CM Tour Ongole: వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 7వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో పర్యటించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మీడియాకు విడుదల చేశారు. గురువారం (7వ తేదీ) ఉదయం 9.55 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ హెలికాఫ్టర్ లో బయలుదేరతారు. 10.35 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. 10.45 గంటలకు హెలిపాడ్ నుండి బయలుదేరి 11 గంటలకు ఒంగోలు బాలుర ఉన్నత పాఠశాలలో సభాస్థలికి చేరుకుంటారు.

పది నిమిషాలు పాటు స్టాల్స్ ను పరిశీలిస్తారు. 11.15 గంటలకు జ్యోతి ప్రజలన, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 11.25 గంటలకు మంత్రుల ప్రసంగాలు, 11.40 నుండి 12 గంటల వరకూ లబ్దిదారులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఉంటుంది. 12.30గంటలకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. 12.45 గంటలకు సభాస్థలి వద్ద నుండి కారులో హెలిపాడ్ కు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 1.05 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి 1.50 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. సీఎం జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు గానూ ముమ్మర ఏర్పాట్లు  చేస్తున్నారు.

Exit mobile version