Home Uncategorized జనసేనకు బిగ్ షాక్ … పోతిన మహేశ్ రాజీనామా

జనసేనకు బిగ్ షాక్ … పోతిన మహేశ్ రాజీనామా

జనసేనకు ఆ పార్టీ నేత విజయవాడ వెస్ట్ ఇంఛార్జి పోతిన మహేష్ రాజీనామా చేశారు.ఈ మేరకు సోమవారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. జనసేన పార్టీలో తనకున్న పదవి బాధ్యతలు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.పోతిన మహేశ్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించగా పొత్తులో భాగంగా, ఆ టికెట్ సుజనా చౌదరికి దక్కిన విషయం తెలిసిందే.విజయవాడ వెస్ట్ లో మూడేళ్ల గా పోతిన మహేష్ పని చేస్తున్నారు.తనకే టికెట్ వస్తుంది అని నమ్మకంతో అధికార పార్టీ మిద , స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మిద గట్టిగా పోరాడారు.విజయవాడ వెస్ట్ లో టిడిపి నుంచి బుద్ధా వెంకన్నా, జలీల్ ఖాన్ ఆశించారు. బిజెపి నీ పొత్తులో తిసుకువచ్చెందుకు జనసేన కొన్ని స్థానాలను త్యాగం చేసింది.అందులో ఒకటి విజయవాడ వెస్ట్ స్థానం ఉంది.

Exit mobile version