Home వార్తలు Kanigiri: లంచం తీసుకుంటున్న విఆర్ఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Kanigiri: లంచం తీసుకుంటున్న విఆర్ఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Kanigiri: వాలంటీర్ తండ్రి పొలాన్ని మ్యుటేషన్ ఆన్లైన్ చేసేందుకు రూ.21 వేలు లంచం తీసుకుంటూ ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని ఏరువారిపల్లి సచివాలయ విఆర్ఓ కాసు వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్పి వి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు ఏరువారిపల్లి విఆర్ఓగా కాసు వేణుగోపాల్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. కనిగిరి మండలం పేరంగూడిపల్లికి చెందిన వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి (గోసులవీడు సచివాలయ వాలంటీర్) తండ్రి వీరంరెడ్డి లక్ష్మిరెడ్డికి ఏరువారిపల్లి పంచాయతీలోని ఆజీస్ పురంలో 2.73 ఎకరాల భూమిని మ్యుటేషన్ చేయాలని వీఆర్వో వేణుగోపాల్ రెడ్డిని వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి సంప్రదించాడు. అయితే భూమిని మ్యుటేషన్ ఆన్లైన్ చేయడానికి 30 వేలు లంచం డిమాండ్ చేశాడు.

అయితే లంచం ఇవ్వడానికి ఇష్టపడని వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి రూ. 21 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని  ఏసీబీ అధికారులను సంప్రదించడం జరిగింది. శుక్రవారం వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి తాహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వో వేణుగోపాల్ రెడ్డితో మాట్లాడి ద్విచక్ర వాహనంపై కనిగిరి కపిల లాడ్జి సెంటర్ కు తీసుకొని వచ్చి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ. 21 వేలు అందజేయడం జరిగింది. మారువేషంలో ఉన్న ఏసిపి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా విఆర్ఓ వేణుగోపాల్ రెడ్డిని పట్టుకున్నారు. సంఘటన స్థలంలోనే పరీక్షలు నిర్వహించగా లంచం తీసుకున్నట్లు రుజువైందని డిఎస్పి శ్రీనివాసులు  తెలిపారు. విఆర్ఓ ను కనిగిరి తాహసిల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. రికార్డులను పరిశీలించారు. తాహసిల్దార్ కార్యాలయంలో విఆర్ఓ కు సంబంధించిన మరో  రూ.32,300 నగదును స్వాధీనం చేసుకొని విచారించగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించక ముందు ఓ భార్యా భర్త వచ్చి విఆర్ఓ కు ఆ నగదు ఇచ్చినట్లు తెల్చారు.

వీఆర్వో ఇంటిలోనూ సోదాలు

కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాచవరంలో విఆర్ఓ కాసు వేణుగోపాల్ రెడ్డి నివసిస్తున్న నివాసంలో ఏసీబీ ఇన్స్ పెక్టర్ అపర్ణ సోదరులు దాడి నిర్వహించగా 10 ఈ పాస్ పుస్తకాలు లభించడం జరిగింది. పాత ఈ పాస్ పుస్తకాలు విఆర్ఓ ఇంటిలో ఎందుకు ఉన్నాయని కోణంలో తాహశీల్దారు పుల్లారావును అడగక విఆర్ఓ ఏ ఉద్దేశంతో తన వద్ద ఉంచుకున్నాడు తెలియదని గడువు తర్వాత వాటిని అందజేస్తే రద్దు చేసే వాళ్ళమని తాహసిల్దారు వివరణ ఇచ్చారు. విఆర్ఓ వేణుగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఎసిబి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డిఎస్పి వి శ్రీనివాసరావు తెలిపారు. లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా అధికారులు ఇబ్బందులు పెడుతుంటే ప్రజలు ఏసీబీ అధికారులను సంప్రదించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అవినీతికి పాల్పడే వారి ఆట కట్టిస్తామన్నారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు పీవీ స్వర్ణ బాబు, సిహెచ్ శేషు, సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version