Home వార్తలు AP High Court: ఏపి ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..! ఎందుకంటే..?

AP High Court: ఏపి ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..! ఎందుకంటే..?

AP High Court: ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుల విషయంలో ఏపి ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ పెండింగ్ బిల్లులపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్ లను కలిపి గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పదేపదే హామీ ఇచ్చి బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆగస్టు 1వ తేదీలోపు నగేరా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోతే ఆగస్టు 1న పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థిక శఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టుకు హజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయడం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.  

నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. ఆగస్టు 1వ తేదీలోగా బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది.

Exit mobile version