Home వార్తలు గురుకుల విద్యా బోధనల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

గురుకుల విద్యా బోధనల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Merugu Nagarjuna

ఏపి గురుకుల విద్యాబోధనకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపి గురుకులాల్లో ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఎంఈసీ (మాథ్స్, ఎకనమిక్స్, కామర్స్) కోర్సును రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున సోమవారం అధికారికంగా వెల్లడించారు.

మాథ్స్ తో పాటు ఆర్ధిక శాస్త్రంపై మంచి పట్టు సాధించేందుకు ఈ కోర్సును విద్యార్ధులు ఎంపిక చేసుకుంటుంటారు. అయితే ప్రభుత్వం ఎంఈసీ కోర్సు స్థానంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎంఈసీ కోర్సు రద్దు నిర్ణయం వచ్చే విద్యాసంవత్సరం నుండి అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

Exit mobile version