Home వార్తలు రాజధాని కేసులో ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో లభించని పూర్తి స్థాయి ఊరట

రాజధాని కేసులో ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో లభించని పూర్తి స్థాయి ఊరట

అమరావతి రాజధాని విషయంలో ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో ఊరట లభించలేదు. ఏపి హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. కాలపరిమితికి సంబంధించిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఏపి రాజధానిని సీఆర్డీఏ చట్టం ప్రకారం అమరావతిలోనే కొనసాగించాలని హైకోర్టు ఆరు నెలల క్రితం ఇచ్చిన తీర్పుపై ఏపి సర్కార్ .. సుప్రీం కోర్టు లో ఎస్ఎల్పీ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం విచారణ జరిపింది, ఏపి ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, రైతుల తరపున సీనియర్ కౌన్సిల్ లు శ్యామ్ దివాన్, ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు వాదనలు జరగగా ఇరుపక్షాలకు పలు అంశాలపై ధర్మాసనం ప్రశ్నలను సంధించింది.

ఇరుపక్షాల వాదనల అనంతరం ఏపి హైకోర్టులో గతంలో ఇచ్చిన పలు ఆదేశాలపై స్టే ఇచ్చింది. నిర్దీత కాల పరిమితిలో రాజధానిలో అభివృద్ధి పనులు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు.. ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. నిర్ణీత వ్యవధిలో రాజధానిలో పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు విధించడంతో ఏపి సర్కార్ కు స్వల్ప ఊరట లభించినట్లు అయ్యింది.

Exit mobile version