Home విశ్లేషణ Sachivalaya Posts: ఆ పోస్టుల భర్తీ ఎప్పుడు..!? సచివాలయ అభ్యర్థుల వేచి చూపులు..!!

Sachivalaya Posts: ఆ పోస్టుల భర్తీ ఎప్పుడు..!? సచివాలయ అభ్యర్థుల వేచి చూపులు..!!

Electricity Crisis: What Should We Do - What Should Governments do

Sachivalaya Posts: నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది..! ఒకరకంగా ఏపీ ప్రభుత్వానికి రాజకీయంగానూ సవాలుగా మారింది.. కొన్ని చోట్ల అవకాశాలు లేక.. ఉన్నా అందిపుచ్చుకోలేక వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు..! కానీ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అవకాశాలు ఉన్నప్పటికీ.., ఖాళీలు ఉన్నప్పటికీ.. భర్తీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ.., అన్ని అర్హతలు సాధించి వేచి చూస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పోస్టుల భర్తీ జరగడం లేదు. వైసీపీ ప్రభుత్వం గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వడంతో పాటూ.., సాధారణ ప్రజలకు సేవలను సులభతరం చేసింది. ఈ విభాగంలో జిల్లాలో 1, 2, 3 క్యాటగిరిలో ఉన్న ఖాళీలలను భర్తీ చేయడం లేదు. నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు.. దీంతో అన్ని అర్హతలు సాధించిన నిరుద్యోగులు నష్టపోతున్నారు..!

Sachivalaya Posts: As per June List

Sachivalaya Posts: మొత్తం 100 పోస్టుల ఖాళీలు..!!

సచివాలయ క్యాటగిరి 1, 2, 3 లో స్లేయిడింగ్, నాన్ జాయినింగ్ పోస్టులు 27 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబరులోనే రాత పరీక్ష నిర్వహించారు. ఒక పోస్టుకి ఇద్దరు చొప్పున ఎంపిక చేసి, ధ్రువపత్రాల పరిశీలనా కూడా పూర్తి చేశారు. స్లేయిడింగ్ ప్రక్రియ దగ్గర నిలిపి వేశారు. దీని ప్రకారం ఒక అభ్యర్థి ఏదైనా 2, 3 ఉద్యోగులాలకు ఎంపికైనప్పటికీ ఏదో ఒక ఉద్యోగంలో చేరవచ్చు. 2019 లో జరిగిన మొదటి దశలో ఇలా ఎంపికలు పూర్తి చేశారు. కానీ 2020 నవంబర్ నాటి ప్రక్రియను మాత్రం పూర్తి చేయకుండా వదిలేశారు. దీనిలో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా.., డిజిటల్ అసిస్టెంట్ పోస్టులను మాత్రమే భర్తీ చేసారు. మిగిలినవి పట్టించుకోలేదు.

  • సచివాలయంలో సుమారుగా 100 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ 5, మహిళా కానిస్టేబుల్ 27, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ 30, వార్డు ప్లానింగ్ 7, ఇలా దాదాపు 19 రకాల విభాగాల్లో సుమారుగా 100 ఖాళీలున్నట్టు ఈ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు మార్లు జిల్లా కలెక్టర్, జేసీలను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. అన్ని అర్హతలు సాధించి కూడా పోస్టులను భర్తీ చేయకపోవడం తమకు అన్యాయం చేసినట్టేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Exit mobile version