Home విశ్లేషణ జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో వైసిపి అభ్యర్థిగా మంగళగిరి నుంచి తానే పోటీలో ఉంటానని గతంలో ఆర్కే ప్రకటించారు. కానీ పద్మశాలి సామాజిక వర్గం కు చెందిన గంజి చిరంజీవిని వైసిపి ఇంఛార్జిగా నియమించింది. మంగళగిరి అభివృద్ధి కి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి నిధులు ఇవ్వలేదని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ పార్టీకి, పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేశారు. గత నెల 21 న షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసురాలిగా వైయస్ షర్మిల కే అర్హత ఉందని సంచలన ప్రకటన చేశారు.

త్రిముఖ పోటీని నివారించేందుకు వైసిపి మాస్టర్ ప్లాన్

వైయస్ షర్మిళ రాకతో రాష్ట్రంలో పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ను కాంగ్రెస్ వైపుకు తిప్పుకునేందుకు షర్మిల అడుగులు వేస్తున్నారు. ఐతే ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, జనసేన లను కాదని కాంగ్రెస్ వైపు కీలక నేతలు ఎవరు వెళ్ళడం లేదు. కానీ మంగళగిరి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. గత రెండు ఎన్నికల్లో వైసిపి నుంచి గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి… రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి, వైసిపి నుంచి గంజి చిరంజీవి, తెలుగుదేశం నుంచి లోకేష్ పోటీలతో మంగళగిరి లో త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. ఈ త్రిముఖ పోటీలో అధికార పార్టీ ఓట్లను ఆర్కే భారీ స్థాయిలో చీల్చుతారని వైసిపి పెద్దలు భావించినట్లు తెలుస్తుంది. మంగళగిరి స్థానంలో మళ్ళీ గెలిచి, లోకేష్ కు చెక్ పెట్టాలని వైసిపి భావిస్తుంది. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి అర్కేతో భేటీ అయ్యి పార్టీలోకి ఆహ్వానించారు అనేది సమాచారం. ఇప్పటకీ వైసిపి ఇంఛార్జి గా ఉన్న గంజి చిరంజీవి ను తప్పించి ఆర్కే ను అభ్యర్థిగా ప్రకటిస్తారా? వైసిపి ఏ నిర్ణయం తీసుకున్నా గంజి చిరంజీవి కట్టుబడి ఉంటారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటకే వైసిపి లో నియమించిన అభ్యర్థులను కొంతమందిని మారుస్తారు అనే వార్త కూడా ఉంది. ఆర్కే ను మళ్ళీ అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.

Exit mobile version