Thursday, May 2, 2024
Home విశ్లేషణ పార్లమెంట్ అభ్యర్థి పైనే బాలినేని భవితవ్యం

పార్లమెంట్ అభ్యర్థి పైనే బాలినేని భవితవ్యం

- Advertisement -

ప్రతిపక్ష పార్టీలను విమర్శించలేకపోతే ఎంతటి రాజకీయ ఉద్దండులకు అయిన రానున్న ఎన్నికలకు సీట్లు లేవని అధికార వైసిపి సిగ్నల్స్ ఇస్తుంది.ఎవరు అయిన పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని,ప్రతిపక్ష పార్టీల నేతల ను,ఇతర రాజకీయ పార్టీల వారిని కలిస్తే ఉపెక్షించం అన్న తీరున వైసిపి వ్యవహరిస్తుంది.అందులో భాగంగానే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరలా టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ముందస్తు సంకేతాలు పంపిస్తుంది. పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి టిడిపి,జనసేన పార్టీల నేతలను విమర్శించకుండా మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. “మాగుంట అన్నా వైసిపి పార్టీలోకి రావాలి,నాన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పార్లమెంట్ సభ్యులు, మీరు పార్టీలోకి వస్తే ఒంగోలు పార్లమెంట్ నుంచి మిమ్మలని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాము” ఇది గత ఎన్నికల సమయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ. ఆ హామీ ఇప్పుడు ఏమి అయ్యిందని మాగుంట అమనుచరులు ప్రశ్నిస్తున్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లో హుందాగా ప్రవర్తిస్తుంటారని,కేవలం ప్రతిపక్ష నాయకులు మీద విమర్శలు చేయకపోతే ఇలా అన్యాయం చేస్తారా అని మాగుంట అనుచరులు వైసిపి అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో టిడిపికి రాజీనామా చేసినప్పుడు కూడా చంద్రబాబును ఎక్కడ విమర్శించలేదని, ఎంపిగా ఓడిపోయినప్పటకి, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారని, క్యాడర్ నిర్ణయానికి అనుగుణంగా వైసిపిలో చేరుతున్నట్లు మాగుంట ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, విజయ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇతర ఎంపిలు హాజరయ్యారు. తనను సంప్రదించకుండా రేవంత్ రెడ్డిని కలవడంపై వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఎంపీల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • బాలినేని పంతం.. జగన్ అభ్యంతరం
    వైసిపి తాజాగా 11 మంది ఇంఛార్జులను నియమించిన తరువాత రాజకీయం వేడెక్కింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే నాలుగు స్థానాలు వాటిలో ఉండటం విశేషం. మంత్రి గా ఉన్న ఆదిమూలపు సురేష్ ను కొండేపికి పంపించడంతో ఇక సాధారణ ఎమ్మెల్యే ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న అభ్యర్థుల్లో ఉన్నది. ఈ అనుమానాలకు చెక్ పెట్టేందుకు బాలినేని కార్యకర్తల సమావేశంలో తరుచుగా ఒంగోలు అసెంబ్లీ నుంచి తాను,ఎంపిగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తామని చెప్పుకొంటూ వచ్చారు. 2014 లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపి నుంచి పోటీ చేయడం మేరకే తాను ఒడిపోయనని,ఆ తప్పు మరలా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రికి తెలియచేశారని సమాచారం.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తనకు జిల్లాలో సీట్ల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కొరిన్నట్లు సమాచారం. 2014 లో వైవీ సుబ్బారెడ్డి ఎంపి గా గెలిచినప్పటకి ఒంగోలు,దర్శి,కనిగిరి, కొండేపి అసెంబ్లీ స్థానాల్లో వైసిపి విజయం సాధించలేదని,మాగుంట తన పార్లమెంట్ పరిధిలో సేవ కార్యక్రమాల ద్వారా మంచిపనులు చేస్తున్నారని,ఒంగోలు ఎంపీ గా మాగుంట ఉంటేనే జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని వివరించినట్లు సమాచారం. ఒంగోలు అసెంబ్లీ స్థానం మాత్రం స్పష్టమైన హామీని ఇవ్వగలమని,మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి పై హామీ ఇవ్వలేమని సిఎం బాలినేని శ్రీనివాసరెడ్డి కి వివరించారని విశ్వసనీయ సమాచారం.జనవరి మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటించి వైసిపి పూర్తి ఎన్నికల వాతావరణంలోకి దిగనున్నట్లు సమాచారం.
- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...