Thursday, May 2, 2024
Home వార్తలు వై.యస్ జగన్ కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి షర్మిళ

వై.యస్ జగన్ కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి షర్మిళ

- Advertisement -

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిళ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత రెండు రోజుల నుంచి సిఎం జగన్మోహన్ రెడ్డి పంపిన రాయబారాన్ని ఆమె తిరస్కరించారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నెల 3 న షర్మిళ ఢిల్లీ పయనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం హైదరాబాద్ లో తన నివాసంలో పార్టీ కార్యవర్గం, అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వై.తే.పా ను కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వారికి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు తాను ఏపి రాజకీయాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిళ వారికి వెల్లడించారు. ఈ నెల 4 న పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్ళు తన వెంట నడిచి,తన నిర్ణయాలను గౌరవించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆమె కోరారు. గురువారం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వారికి వెల్లడించారు.

2021 జూన్ లో తెలంగాణలో పార్టీ స్థాపించిన ఆమె కేసీఆర్ ను గద్దె దించడానికి పోరాడుతున్నట్లు ప్రకటించారు.అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలకుడదన్న భావనతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నించారు. స్థానిక పరిస్థితులు,2018 ఎన్నికల అనుభవాలు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆమె పొత్తు విషయంలో కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోయినా..తాను పోటీ చేసి సిఎం కేసీఆర్ కు మేలు కలిగించనని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మీడియా సమావేశంలో ఆమె ప్రకటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా తెలంగాణ నుంచే రాజకీయాలు చేస్తానని ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుర డిమాండ్ చేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ పెద్దలను కోరినట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని.. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలహీనంగా ఉన్నందున, ఏపి రాజకీయాల వైపు వెళ్లాలని షర్మిళ కు కాంగ్రెస్ పెద్దలు తెలిపినట్లు సమాచారం.

  • ఆంధ్రప్రదేశ్ పిసిసిగా వై.యస్ షర్మిళ ?
    ఉమ్మడి రాష్ట్రం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడింది.కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం ను వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకువెళ్లడం కాంగ్రెస్ పార్టీ ను మరింత బలహీనపరచింది. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన పెద్ద లీడర్లు సైతం టిడిపి,వైసిపి,బిజెపి లోకి వెళ్ళిపోయారు. 2014,2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు శాతం లోపు ఓట్లు నమోదు అయ్యాయి. కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ,పొరుగున ఉన్న ఏపి పై దృష్టి సారించింది. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి కంటే మెరుగైన ఓట్లను పొందేందుకు,అధికార వైసిపి ను గద్దె దింపేందుకు లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది.అందులో భాగంగానే సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలిగా నియమించనుంది.రానున్న ఎన్నికలలో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు షర్మిళ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.కడప లో మిశ్రమ ఫలితాలు ఎదురుఅయితే కర్ణాటక నుంచి రాజ్యసభ కు పంపించే హామీ కూడా ఆమె కు ఇచ్చినట్లు సమాచారం.
  • షర్మిళ రాకతో ..వైసిపికు డేంజర్ బెల్స్..?
    వైయస్.షర్మిళ రాకతో అధికార వైసిపి పార్టీకి తీవ్ర ప్రతికూల ఫలితాలు రానున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లకు టికెట్ ప్రకటించని పక్షంలో వారికి ప్రత్యామ్నాయ మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఉండనున్నది. అటు టిడిపి,జనసేన పొత్తులో భాగంగా ఉత్తరాంధ్రలో వైసిపి కు తీవ్ర ఇబ్బందిరకర ఫలితాలు రానున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఇంఛార్జుల నియామకం అధికార పార్టీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో,షర్మిళ అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కి రావడం సిఎం జగన్ కు తీవ్ర నష్టమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో వైసిపి 49 శాతం ఓట్లను పొంది 151 భారీ స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు.39 శాతం ఓట్లు సాధించిన టిడిపి కేవలం 23 సీట్లలో విజయం సాధించింది.జనసేన పార్టీ 6 శాతం ఓట్లను పొంది, ఒక ఎమ్మెల్యే తో సరిపెట్టుకుంది. షర్మిళ కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తూ రానున్న ఎన్నికల్లో పది శాతం ఓట్లను పొందినా.. అధికార పార్టీ వైసిపికే నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...