Saturday, April 27, 2024
Home విశ్లేషణ చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

- Advertisement -

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో పక్క దేశంలో అన్ని రాష్ట్రాలను పూర్తి కాషాయమయం చేస్తామని బిజెపి నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాజ్యంగ బద్ధంగా వ్యవహరించలవల్సిన గవర్నర్ ను, కేంద్ర ఆధీనంలో ఉండే వ్యవస్థలను ప్రతిపక్ష పార్టీల మీద బిజెపి ప్రయోగిస్తుంది. కేంద్రానికి , రాష్ట్రానికి వారధిగా ఉండవలసిన గవర్నర్ ను బిజెపి యేతర పార్టీల ముఖ్యమంత్రి లును పీఠం నుంచి దింపేందుకు వాడుతున్నారని కాంగ్రెస్ , ఆప్, ఇతర పార్టీలు బిజెపిని విమర్శిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే గవర్నర్ ను ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తున్నారన్న విమర్శ బిజెపి మీద ఉంది. సీబీఐ, ఈ.డి., ఐ.టి లతో ప్రతిపక్ష సభ్యులకు చెందిన ఆర్థిక,వ్యాపార విషయాల్లో నిరంతరం దాడులు చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.బీజీపీ యేతర పార్టీలకు మేయర్ పీఠం నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు ఎదురు అయ్యే న్యాయ చిక్కులు మొత్తం అత్యున్నత న్యాయ స్థానమే పరిష్కరిస్తుంది.

గత పదేళ్లలో కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, అరుణాచల ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బిజెపి చీలిక రాజకీయాలను ప్రోత్సహించి ప్రభుత్వాలను కూల్చేసింది. గవర్నర్ లను ఉపయోగించి ప్రభుత్వాలను పూర్తిగా మార్చేసింది. ఆయా రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ కు బిజెపి అతి దగ్గరకు వచ్చినా, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా ఆ ప్రభుత్వ ఐదేళ్లు ఉంటుందా? లేదా? అనేది అనుమానమే. మహారాష్ట్ర లో 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు..శివసేన, ఎన్సిపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటివరకు తమతో ఉన్న శివసేన కాంగ్రెస్ తో జత కట్టడం బిజెపి జీర్ణించుకోలేక పోయింది. అధికార శివసేన లో ఎమ్మెల్యే లను చీల్చి చిలక నాయకుడి అయిన ఏక్ నాధ్ షిండే కు బిజెపి కు చెందిన ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో పెట్టింది. కర్ణాటకలో 2018 ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండలేదు. జేడీఎస్, కాంగ్రెస్ ల నుంచి ఎమ్మెల్యే లను చీల్చి బిజెపి నేతృత్వంలోని యడియారప్ప ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటక, మహారాష్ట్ర లల్లో బలమైన సంఖ్యల్లో బిజెపి ఎమ్మెల్యే లు ఉన్నారు. ఫలితం గా ప్రభుత్వాలు మారాయి. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు అయిన శివసేన,జేడీఎస్ కు నలబై ఎమ్మెల్యేలు ఉన్నారు. వాటిలో చీలిక తెచ్చి అధికారాన్ని పూర్తిగా మార్చేసింది.

- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లో  2019 ఏడాదిన జరిగిన  సార్వత్రిక. ఎన్నికల్లో టిడిపి భారీ ఓటమిని మూటకట్టుకుంది. ఆ భారీ ఓటమి తరువాత ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు పై బిజెపి వ్యవస్థలతో  దాడులు ప్రారంభించింది. ఫలితం గా చంద్రబాబు కు అత్యంత సన్నిహితులు అయిన సిఎం రమేష్, సుజనా చౌదరి,టీజీ వెంకటేష్ బిజెపి లోకి ఫిరాయించారు.  అయినా కానీ నేడు చంద్రబాబు బిజెపితో  పొత్తు కోసం  ఎదురు చూస్తున్నారు. టిడిపి, జనసేన మద్దతుతో  ఆంధ్రప్రదేశ్ లో  లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. తమ స్వప్రయోజనాలకే ప్రాధానత్య ఇచ్చి ఇతర పార్టీలను అనగదొక్కే  బిజెపి  టిడిపి ను ఎం చేయనున్నది అని పెద్ద ప్రశ్న. రాష్ట్రంలో బిజెపి ప్రభావం తగ్గించేందుకు చంద్రబాబు కొంత మేరకు విజయం సాధించారు.
- Advertisement -

వైసిపి ,బిజెపి లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు .

- Advertisement -

అధికార వైసిపి వ్యతిరేక ఓటును చీలనివ్వని రెండేళ్ళ క్రితమే జనసేన అధ్యక్షులు పవన కళ్యాణ్ ఇప్పటం సభ సాక్షిగా ప్రకటించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఇంకా ఒక అడుగు ముందుకు వేసి రానున్న ఎన్నికల్లో టిడిపి ,జనసేన కలిసి పోటీ చేస్తాయి అని తెలిపారు.బీజీపీ కూడా కలిసి వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.పొత్తులో అభ్యర్థులను ప్రకటిస్తు… ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ప్రయోగం చేసే బదులు తక్కువ స్థానాలు పోటీ చేసి విజయం సాధించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బిజెపి మాతో కలిసి వచ్చిన తరువాత పూర్తి స్థానాలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి దాదాపు 145 కు పైగా స్థానాల్లో పోటీ చేయనున్నది.జనసేన 24 స్థానాలు ,బీజీపీ కలిసి వస్తే నాలుగు నుంచి ఆరు అసెంబ్లీ స్థానాలు, నాలుగు పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టిడిపి,జనసేన సిద్ధంగా ఉన్నాయని సమాచారం. కర్ణాటక , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ ,గోవా లలో ప్రభుత్వాలను పడగొట్టే విషయంలో అక్కడ సీట్ల సంఖ్య లో రెండవ స్థానంలో ఉంది.ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బిజెపి ప్రభుత్వాలను, తమ మిత్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పోటీ చేసే స్థానాలు ఆరు కంటే తక్కువుగా ఉంది.టీడిపి, జనసేన, బీజీపీ లతో కూడిన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అసెంబ్లీ అతి పెద్ద పార్టీగా టిడిపి ఉండనుంది. ఆరు స్థానాలు ఉన్న బిజెపి చీలిక రాజకీయాలను ప్రోత్సహించి 88 ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయటం అసాధ్యం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను మహారాష్ట్ర రాజకీయాల మాదిరిగా మరో ఎక్ నాధ్ షిండే ను చేయధలుచున్నా జనసేన పార్టీ కి ఉన్న విలువలు తో కూడిన రాజకీయం సిద్ధాంతం కాదని ఆయన ఫిరాయింపుల రాజకీయం చేయరని కొంత మంది అభిప్రాయంగా ఉంది. తెలుగుదేశంతో ఉంటూ పవర్ షేరింగ్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ టిడిపి ను వదులుకొని బీజీపీ తో చేతులు కలపరని సమాచారం. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు వహించిన చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలు కోసమే పరిమిత సంఖ్యలో పోటీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ ఇద్దరు అధికార వైసిపిని గద్దె దింపటమే లక్ష్యం గా పొత్తు పెట్టుకొని ముందుకు పోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

వైసిపిలో బాలినేని కథ ముగియలేదు….రానున్న రోజుల్లో పోకిరి తరహాలో ట్విస్ట్లు..

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసిపికి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక నాయకుడు. గత ఎన్నికల్లో ఆయన చెప్పిన వారికే సీట్లు కేటాయించి గెలిపించుకున్నారు. పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మూడేళ్లు...

Most Popular

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...