Tuesday, April 30, 2024
Home విశ్లేషణ మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

- Advertisement -

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ మేనిఫెస్టో ను విడుదల చేస్తుంటాయి. సగటు ఓటరు కూడా పార్టీలకు అతీతంగా పార్టీల మేనిఫెస్టోను బేరీజు వేసుకుని ఓటు వేస్తారు.రాష్ట్రంలో జరిగిన 2019 ఎన్నికల్లో వైసిపి కి 50 శాతం ఓట్లు , 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపిలు రావడానికి కారణం కూడా ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో నే కారణం అని రాజకీయ నిపుణులు భావిస్తూ ఉంటారు. దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ ఫార్ములా నే కాంగ్రెస్ ను కాపాడాయి అనే చర్చ ఉంది. ఢిల్లీ లో అధికారంలో ఉన్న ఆప్ పంజాబ్ లో కూడా అధికారాన్ని విస్తరించడానికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను మేనిఫెస్టో లో ప్రవేశ పెట్టి విజయం సాధించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఓటములను మేనిఫెస్టో కూడా మెజారిటీ స్థాయిలో ప్రభావితం చేస్తూ ఉంటుందండానికి ఇలాంటి సాక్ష్యాలు గత ఐదేళ్లుగా చూస్తూ ఉన్నాం. మేనిఫెస్టో కు అంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టే ప్రధాన పార్టీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాయి.రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చినప్పటకి అధికార వైసిపి,ప్రతిపక్ష పార్టీలు అధ్యక్షులు మాత్రం మేనిఫెస్టో పై నోరు విప్పడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదరమెట్ల లో జరిగిన చివరి సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని వైసిపి కీలక నాయకులు ప్రకటించారు.కానీ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం లో ఎక్కడా హామీల జల్లు కురిపించలేదు. మేనిఫెస్టో ప్రకటన వలన సభకు ఊపు వచ్చింది కానీ హామీల జాబితా రాలేదు. టిడిపి , జనసేన, బిజెపి కూటమి సంయుక్తంగా చిలకలూరిపేటలో బొప్పుడి సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని టిడిపి కీలక నేతలు చెప్పారు.కానీ వారు కూడా షాక్ ఇచ్చారు.

  • మేనిఫెస్టో పై ఎత్తులకు పై ఎత్తులు

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికలకు 100 రోజుల ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించారు. కానీ మేనిఫెస్టో పై కేసీఆర్ వేచి చూశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో అసాధ్యం అని విమర్శిస్తునే అంతకుమించి హామీల వర్షం కేసీఆర్ కురిపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో పై చివరి వరకు వేచి చూసే ధోరణిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. నాలుగు నెలల క్రితమే టిడిపి, జనసేన లు 11 అంశాలతో మినీ మేనిఫెస్టో ని ప్రజల్లోకి తీసుకువెల్లాయి. రానున్న రోజుల్లో యువత, రైతాంగం, రాజధాని, సంక్షేమం లతో కూడిన రాష్ట్ర అభివృధి లక్ష్యంగా మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా నవరత్నాలు, ఆరోగ్యశ్రీ అమలు చేయవలసిందే…వాటికే రాష్ట్ర బడ్జెట్ దాటిపోతుంది. అలాంటప్పుడు చంద్రబాబు మినీ మేనిఫెస్టో కే బడ్జెట్ సరిపోదు.ఇక పూర్తి మేనిఫెస్టోతో రాష్ట్రం అప్పుల్లో కి కూరుకుపోతుంది అని జగన్మోహన్ రెడ్డి సభలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రం తో పొత్తు పెట్టుకున్నాం. ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడతాము అని చంద్రబాబు ధీమా గా ఉన్నారు. అధికారం లోకి రాగానే హామీలు అమలు ఎలా ఉన్నా… ప్రధాన పార్టీలు భారీ స్థాయిలో తాయులాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని..అందులో భాగంగానే ఒకరు ప్రకటించిన తరువాత మరొకరు భారీ ఎత్తున హామీలు గుప్పించెందుకు ఆలస్యం చేస్తున్నారని సమాచారం. ఎన్నికలకు ఇంకా 40 రోజులు సమయం మాత్రమే ఉంది. పూర్తి విశ్వాసంతో, సాధ్యం అయ్యే హమీలను ఇచ్చి అమలు చేసే పార్టీలకే ఓటు వేద్దాం.సాధ్యం కాని హామీలను ఇచ్చే పార్టీలను భూస్థాపితం చేసే విధంగా రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.

- Advertisement -
RELATED ARTICLES

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

వైసిపిలో బాలినేని కథ ముగియలేదు….రానున్న రోజుల్లో పోకిరి తరహాలో ట్విస్ట్లు..

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసిపికి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక నాయకుడు. గత ఎన్నికల్లో ఆయన చెప్పిన వారికే సీట్లు కేటాయించి గెలిపించుకున్నారు. పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మూడేళ్లు...

Most Popular

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...