Home మా ఎడిటోరియల్ Online Prakasam: కరణం – ఆమంచి..! ఎవరెక్కడ – ఎవరెలా..!? అంతర్గత అంచనా..!!

Online Prakasam: కరణం – ఆమంచి..! ఎవరెక్కడ – ఎవరెలా..!? అంతర్గత అంచనా..!!

Online Prakasam: Karanam Amanchi Internal Party Stand?
Online Prakasam: Karanam Amanchi Internal Party Stand?

Online Prakasam: వైసీపీ అంతరపోర్లు కొన్ని అస్పష్టతలను మిగులుస్తున్నాయి.. ఈ పొర్లు వెనుక పుడుతున్న కొన్ని పుకార్లు మరింత గందరగోళం పెంచుతున్నాయి.. సోషల్, డిజిటల్ మీడియాలు దానికి కొత్త పోకడలు సృష్టిస్తున్నాయి.. జిల్లాలో వైసీపీలో నెలకొన్న విభేదాలపై సీఎం జగన్ ఒక స్పష్టతతోనే ఉన్నారు.. ఆయా నాయకులు కూడా ఒక స్పష్టతతోనే ఉన్నారు.. చీరాల నియోజకవర్గ కేంద్రంగా కొన్ని నెలలుగా వైసీపీలో నెలకొన్న విబేధాలు చూస్తూనే ఉన్నాం. దర్శిలో విబేధాలు దర్శిస్తూనే ఉన్నాం.. దర్శి విషయంలో సీఎం జగన్ స్పేష్పతనిచ్చేసారు. బూచేపల్లికి ఎమ్మెల్సీ ఇచ్చి, మద్దిసెట్టికే మళ్ళీ సీటు అంటూ ఫిక్స్ చేశారు. కాకపోతే దీన్ని బూచేపల్లి వర్గం అంతగా అంగీకరించడం లేదు, అందుకే వేచి చూసే ధోరణిలో ఉంది.. ఇక చీరాల విషయంలో కొన్ని భిన్నమైన వార్తలు తరచూ వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కి పర్చూరు ఇంఛార్జిగా వెళ్ళమన్నారంటూ ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. అవి నిజమే అయినప్పటికి ఆమంచి అందుకు అంగీకరించక, చీరాలకే ఫిక్స్ అయిపోవడంతో అక్కడి గొడవలపై మళ్ళీ ఫోకస్ పడింది. ఇప్పుడు కరణం బలరాంని పర్చూరు పంపిస్తున్నారంటూ కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇది కూడా అవాస్తవమే.. కరణం విషయంలో పార్టీ ఒక స్పష్టతతో ఉంది.. అద్దంకిలో ఉన్న రాజకీయ అవసరాల దృష్ట్యా చివరి నెలల్లో ఆయనను అటు మారిస్తే మార్చవచ్చు.. లేదా చీరాలకే ఫిక్స్ చేయవచ్చు..! పర్చూరు విషయంలో నాన్ కమ్మ అభ్యర్థినే దించాలనేది జగన్ సూటి ప్రణాళిక..!

Online Prakasam: Karanam Amanchi Internal Party Stand?

Online Prakasam: రెండు వైపులా చిక్కులే..!

చీరాలలో కరణం బలరాం ప్రస్తుతం స్ట్రాంగ్ గా ఉన్నారు. పార్టీలో చేరిన తర్వాత క్రమేణా తమ పూర్తి వర్గాన్ని పార్టీలో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. వారూ పార్టీ వర్గంతో కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆమంచి కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. పార్టీ మద్దతు లేకుండా అభ్యర్థుల్ని గెలిపించి సొంత బలంపై పార్టీకి స్పష్టమైన సంకేతాలిచ్చారు. సో.. చీరాలలో రెండువైపులా బలమైన నాయకత్వం వైసీపీకి బలం, ఇదే బలహీనత కూడా.. ఈ ఇద్దరికీ పార్టీలో కూడా ఎవరి అండదండలు వారికున్నాయి. ఈ ఇద్దర్నీ జాగ్రత్తగా వినియోగించుకోకపోతే పెద్ద దెబ్బ తప్పదు.

  • నిజానికి కొన్ని నెలల కిందట సీఎం జగన్ మదిలో ఉన్న ఒక ప్రణాళిక ప్రకారం. పర్చూరు నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం డామినేటెడ్ అయినప్పటికీ.., బీసీ, కాపు ఓటింగ్ కూడా ఎక్కువ. కానీ అక్కడ సుధీర్ఘకాలంగా కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వరుసగా గెలుస్తున్నారు. టీడీపీకి అదే బలం. ఆ బలాన్ని కొట్టాలంటే యాంటీ కమ్మ ఫార్ములాని ప్రయోగించి.. నాన్ కమ్మ స్ట్రాంగ్ లీడర్ ని అభ్యర్థిగా దించి.. ఆ స్ట్రాటజీ ద్వారా గెలవాలనేది ఒక ఆలోచన.. అందుకు ఆమంచి సరైన ప్రత్యామ్నాయం అని పార్టీ పెద్దలు భావించారు. కానీ ఆమంచి అందుకు అంగీకరించలేదు. చీరాలను విడిచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. పైగా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడంతో ఆయన అక్కడే ఫిక్సయ్యారు. సో.., ఆమంచి రానప్పటికీ జగన్ ఇప్పటికీ పర్చూరు విషయంలో నాన్ కమ్మ ఫార్ములాకు కమిట్ అయ్యారు.., దీనిలో మార్పు ఉండకపోవచ్చు. అంచేత అక్కడ కరణం బలరాం, వెంకటేష్ అనే ఊసే అవసరం లేదు.
Online Prakasam: Karanam Amanchi Internal Party Stand?
  • మరి ఇద్దర్నీ చీరాలలో ఎలా సర్దుబాటు చేస్తారనే సందేహం రావచ్చు..! అక్కడ ప్రస్తుతం “కరణం X ఆమంచి” చాలా గట్టిగా నెలకొంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు నియోజకవర్గాన్ని వదిలినా ప్రత్యర్థుల అనుచరుల్ని చెల్లాచెదురు చేయడమో/ లొంగదీసుకోవడమో లేదా దెబ్బ కొట్టడానికో అవతలి వారు సిద్ధంగా ఉన్నారు. అంచేత ఇద్దర్నీ నియోజకవర్గం నుండి పక్కకు తప్పించి, ఈ ఇద్దరి బలాన్ని మరో అభ్యర్ధికి ఉపయోగపడేలా చేయడం పార్టీ పెద్దల్లో ఉన్న మరో ఆలోచన.. కొన్ని నెలల కిందట ఇదే ఆలోచనతో పర్చూరుకి ఆమంచి, చీరాలకి బీసీ ఇంచార్జి, అద్దంకికి కరణం వెంకటేష్ అనుకున్నారు.. పార్టీ ఇప్పటికీ అదే స్టాండ్ లో ఉంటే… ఆమంచి ఒప్పుకుంటే పర్చూరుకి వెళ్ళవచ్చు. అదే సమయంలో అద్దంకికి కరణం వెళ్లాల్సి రావచ్చు. కరణం కూడా అద్దంకికి వెళ్ళడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు.., చీరాలలో బలంతో పాటూ శత్రుత్వాన్ని పెంచుకోవడం కంటే పార్టీ ఆదేశాల మేరకు తనకు బాగా పట్టున్న అద్దంకిలో రాజకీయం చేయడమే సులువు. కరణం వెంకటేష్ అయితే పూర్తిగా పార్టీ స్టాండ్ పై ఉన్నారు. “పార్టీ పెద్దలు ఎక్కడికి వెళ్ళమన్నా, తాను సిద్ధమే” అంటూ తమ వర్గీయులతో చెప్తున్నారు. కానీ ఇక్కడే పెద్ద చిక్కు ఉంది.., అద్దంకిలో ఇప్పటికే పునాదులు స్ట్రాంగ్ వేసుకుని.., వరుసగా ఎన్నికల్లో గెలిపించుకుంటూ వస్తున్న బాచిన కృష్ణ చైతన్య పరిస్థితి ప్రశ్నర్ధకంగా మారుతుంది..!
  • అద్దంకి నుండి వరుసగా మూడు సార్లు.., 2019 లో వైసీపీ గాలిలో కూడా సునాయాసంగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ వంటి నేతని అద్దంకిలో ఓడించాలంటే బాచిన కృష్ణ చైతన్య బలం పూర్తిగా చాలకపోవచ్చు. అతనికి పార్టీ పెద్దల నుండి, అధిక ఓట్లు ఉన్న తమ సామజిక వర్గం నుండి.., అన్ని రకాలుగా మద్దతుండాలి. అక్కడ మొదటి నుండి పునాదులు స్ట్రాంగ్ గా ఉన్న కరణం వర్గం సహకారం పూర్తిగా ఉండాలి. గొట్టిపాటి రవి విషయంలో కచ్చితంగా ఓడించాలి అని పట్టుదల మీదున్న జగన్ అద్దంకి నియోజకవర్గం విషయంలో ఏ మాత్రం రిస్క్ చేసే అవకాశం ఉండదు.
  • ఫైనల్ గా ప్రస్తుతం ఉన్న అంచనాలు, అంతర్గత మాటలు ప్రకారం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ చీరాల లేదా పర్చూరు నుండి పోటీ చేసే వీలుంది. కరణం చీరాల లేదా అద్దంకి నుండి పోటీ చేసే వీలుంది. ఇద్దరూ చీరాలకే కమిట్ అయితే.. “మేము తేల్చుకుంటామ్, మా బలాలు నిరూపించుకుంటాం” అని అనుకుంటే.., ఎవరో ఒకరు చివరి నిమిషంలో పార్టీ మారడమో, రెబల్ గా వేయడమో తప్పకపోవచ్చు..! ప్రత్యర్థి పార్టీ ఈ ఇద్దరిలో ఒకరి రాక కోసం చూస్తుంది. దర్శిలో కూడా ప్రత్యర్థి పార్టీ ఆ ఇద్దరిలో ఒకరి రాక కోసం చూస్తుంది..!
Exit mobile version