Home మా ఎడిటోరియల్ Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: Triangle But Internal Fights
Addanki Politics: Triangle But Internal Fights
  • Addanki Politics: కరణం వర్గానికి – గొట్టిపాటి, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది. కుటుంబ పరమైన ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో గొట్టిపాటికి చేసారు. ఇప్పుడు కరణం వైసీపీలోకి వెళ్లినప్పటికీ ఇక్కడ వర్గం మాత్రం అటూ, ఇటూ ఊగిసలాడుతుంది..! మరి వచ్చే ఎన్నికల్లో ఎటు చేస్తారు..!?
  • బాచిన వర్గానికి – కరణం, గొట్టిపాటి రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది.. కానీ 2009, 2014 లో గొట్టిపాటికి చేయాల్సి వచ్చింది. అందుకే 2019 ఎన్నికల్లో కీలక సమయంలో ఇద్దరు శత్రువుల బలంతో తలపడాల్సి వచ్చింది..! సేమ్ వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాగే ఉంటె నెట్టుకురాగలరా..!?
  • గొట్టిపాటి వర్గానికి – కరణం, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది.. కానీ ఎన్నికల సమయంలో ఎక్కడో ఒకరితో కాంప్రమైజ్ కాక తప్పనిసరి పరిస్థితి నెలకొంటుంది..! సేమ్ వచ్చే ఎన్నికల్లో ఇది వర్కవుట్ కాకపోతే ఇద్దరు ఏకమైతే నెట్టుకురాగలరా..!?
Addanki Politics: Triangle But Internal Fights

“అద్దంకి ముక్కోణ రాజకీయం”లో ఎవరితో ఎవరు.. ఎప్పుడు.. ఎలా కాంప్రమైజ్ అవుతారో ముందే చెప్పడం కష్టం. వారికి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండదు.. అటువంటిది ముందు అంతా కెలుక్కోవడం, కవ్వించుకోవడం, దారిలో అల్లరి చేయడం వంటి పనులెందుకట..!? ఈ విషయంలో కరణం వర్గానిదే పై చేయిగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు సందర్భం వస్తుందా “కవ్విద్దాం.., బలం చూపిద్దాం” అనే రీతిలో ఈ వర్గంలో కుర్రాళ్ళుంటారు.. ఒక్కోసారి అసందర్భం, అనవసరంగా కూడా ప్రత్యర్థిని కవ్విస్తారు.. (మొన్న బాలినేని ర్యాలీలో చేసినట్టుగా) సో.. ఈ ముక్కోణ రాజకీయంలో ప్రస్తుతం ఎవరు ఎలా..? ఎవరి వ్యూహం ఎలా అనేది చూద్దాం.!

Addanki Politics: గొట్టిపాటి @ ఎప్పుడూ ఆధారపడితే ఎలా..!?

గొట్టిపాటి వరుసగా మూడుసార్లు ఇక్కడ గెలిచారు. మొదటి రెండు గెలుపులు పక్కన పెడితే మూడో గెలుపు మాత్రం ఎదురుగాలిలో, బీభత్సమైన పోరులో గెలిచారు..! అయితే ఆయన హ్యాట్రిక్ గెలుపుల్లో వేరే వాళ్లపై ఆధారపడ్డారు అనే మాటలను బలంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. 2009, 2014లో బాచిన అనుచర వర్గం చేస్తేనే రవికుమార్ బయటపడ్డారని.. ముఖ్యంగా 2014లో బాచిన వర్గం చేయకపోతే .. ఆ 4500 మెజారిటీ వచ్చేది కాదని వారి గట్టిమాట..! నాడు ఓడిపోతే అసలు గొట్టిపాటి రాజకీయమే కష్టమయ్యేదని.. ఆయన వర్గం అంటున్నారు.. 2019కి వస్తే కరణం వర్గం పని చేసింది కాబట్టే ఆయన గెలిచారని.. లేకపోతే అంత సులువు కాదని అంటున్న మాట..! సో.. వెతికి గొట్టిపాటి వర్గం నుండి సమాధానం లేదు. ఒకరకంగా అంగీకరించాల్సిందే..! అందుకే వచ్చే ఎన్నికల్లో కరణం , బాచిన వర్గాలు కలిసినా తాము కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో గొట్టిపాటి వర్గం ఉన్నారు. అలా గెలిస్తేనే ఈ హ్యాట్రిక్ గెలుపులకు అర్ధం కూడా ఉంటుంది..! ఇదే సందర్భంలో ఈ రెండు వర్గాల కంటే బలంగా ఉన్నారు కాబట్టే కదా.. ఆ వర్గాలు గెలవలేక మేము వరుసగా గెలుస్తున్నాం అనే వాదనని ఈ వర్గం చెప్తుంది..! కాసేపు ఈ వాదనలను పక్కన పెడితే

Addanki Politics: Triangle But Internal Fights

Addanki Politics: కరణం.. అస్పష్టతకు కారణం..!?

కరణం వర్గం ప్రస్తుతం అస్పష్టతతో ఉంది.. చీరాలలో వైసీపీ, అద్దంకిలో టీడీపీ అన్నట్టుగా ఈ వర్గం తీరు ఉంది..! ఇక్కడ టీడీపీకి సిన్సియర్ గా చేస్తూనే.. చీరాల వెళ్లి వైసీపీ కండువాలు వేసుకోవాల్సిన మధ్యంతర స్థితిలో ఉన్నారు. ముందు నుండి ఉన్న పార్టీపై ఆ మమకారం పోవడం లేదు.. చీరాలలో అంటే అక్కడి పరిస్థితులను బట్టి మా వాళ్ళు పార్టీ మారారు.. మేము వెళ్లాల్సిన పనేముంది..!? అనే రీతిలో ఈ వర్గం ఆలోచనలు ఉన్నాయి..! ఒక వేళ వచ్చే ఎన్నికల్లో తమ నాయకులు ఈ నియోజకవర్గం నుండి వైసీపీ నుండి పోటీ చేస్తే మేము వైసీపీ.. లేకపోతే మేము టీడీపీ అనే కోణంలో ఉన్నారు..! అంటే బాచిన వర్గంతో కలవడం, పార్టీకి చేయడం ఇష్టం లేదన్నది అంతరార్ధం.. అందుకే బాచిన వర్గంతో పార్టీ, వ్యక్తిగత శత్రుత్వానికి కాలు దువ్వుతున్నారు! ఒకరకమైన రాజకీయ అస్పష్టతతో ఇక్కడి కరణం వర్గీయులు ఉన్నారు. ఎక్కువగా చీరాలలో తమ నాయకుడి రాజకీయంపైనే ఆధారపడ్డారు..!

Addanki Politics: Triangle But Internal Fights

బాచిన వర్గం.. కొత్త వ్యూహం..!

ఆ రెండు వర్గాలతో పోలిస్తే రాజకీయంగా పునాదులు ధీటుగా ఉన్నదీ బాచిన వర్గానికి..! ఆ వర్గానికి పెద్దాయన గరటయ్య నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగా ఉండడం.. ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలవడం.. కాకపోతే మధ్యలో వేసిన అడుగుల కారణంగా ఆ వర్గం చురుకు తగ్గినా.. ఈ రెండేళ్లలో పూర్తిగా యాక్టీవ్ అయింది. సో.. ఇప్పుడు బాచిన కృష్ణ చైతన్య సైలెంట్ రాజకీయంతో.. ఆ వర్గీయులకు ఊపొచ్చింది. తమ ఇద్దరు ప్రత్యర్థి వర్గాలను ధీటుగా ఎదుర్కొంటున్నా.. కరణం వర్గం విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. కృష్ణ చైతన్య ముందుగా అద్దంకిలో పూర్తిగా ఆధిపత్యంపై దృష్టి పెట్టారు. ఆ దిశగా సక్సెస్ అయిన తర్వాత రాజకీయ శత్రుత్వంపై దృష్టి పెట్టె కోణంలో సూచనలు ఇస్తున్నారు. అయితే ఆధిపత్యం చేతికొచ్చి.., పట్టు దొరికిన వెంటనే రాజకీయం మొదలయింది. కానీ.., పరాయి పార్టీలో ఉన్న గొట్టిపాటి వర్గంతో వీళ్లకు సమస్యే లేదు.. వేరే నియోజకవర్గంలో సొంత పార్టీలో ఉంటూ.. ఇక్కడ తమతో శత్రుత్వానికి కాలు దువ్వుతున్న కరణం వర్గం విషయంలోనే బాచిన వర్గం వ్యూహాత్మక అడుగులు వేయాల్సి వస్తుంది. మొన్న జరిగిన బాలినేని ఆహ్వాన ర్యాలీలో కూడా కవ్వింపులకు కాస్త వెనుకడుగు వేశారు. వెనక్కు తగ్గారు. లేకపోతే అక్కడ బాచిన X కరణం రణంగా మారేది.

సో.. ఈ మొత్తం వ్యవహారంలో బాచిన కృష్ణ చైతన్య మృధుస్వభావి.. గొడవలకు దూరం అనే వాదన అయితే అద్దంకి నియోజకవర్గంలో ఉంది. అందుకు కారణం “కరణం, గొట్టిపాటి వర్గాలకు ఆల్రెడీ రక్తపు మరకలు అంటడమే.. బాచిన వర్గంపై కూడా అద్దంకిలో సహా సంతమాగులూరులో కొన్ని మరకలు ఉన్నప్పటికీ.. తమ వాళ్లనే పోలీసులకు అప్పగించిన సందర్భాలున్నాయి. వారితో పోలిస్తే కృష్ణ చైతన్య కాస్త వివాదరహితుడు అనే టాక్ ఉంది. అందుకే ఈ వర్గం జాగ్రత్తగా ఉంటుంది. సైలెంట్ గా బలం పెంచుకుంది. కొన్ని గ్రామాల్లో పాతుకుపోయింది. కానీ రాబోయే రోజుల్లో కొన్ని తప్పకపోవచ్చు. అప్పుడు కూడా పరాయి పార్టీ శత్రువులతో పెద్ద సమస్యేమీ లేదు ఎదుర్కోగలం.. కానీ సొంత పార్టీ శత్రువుల మాటేమిటి..!? అంటూ పార్టీ పెద్దల దృష్టిలో పెట్టె పనిలో ఉన్నట్టుగా సమాచారం..!

Exit mobile version