Home విశ్లేషణ రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వైసిపి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. తమ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న ఎస్సీ,ఎస్టీ ఓట్లను ఎన్డీయే కూటమికి బదిలీ కాకుండా కీలక చర్యలు తీసుకునేందుకు పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో మొత్తం 29 ఎస్సీ స్థానాల్లో 27 సీట్లను వైసిపి కైవసం చేసుకుంది. మొత్తం ఏడు ఎస్టీ స్థానాల్లోను వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. ఐతే ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అధికార వైసిపి 70 కు పైగా స్థానాల్లో ఇంచార్జీలను మార్చేసింది. అందులో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 25 కు పైగానే ఉన్నారు.అందులో కొంతమంది సిట్టింగ్ దళిత ఎమ్మెల్యేలకు సీట్ నిరాకరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కీలక పదవలు ఇస్తామని హామీ సిఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతవరకూ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి పని చేయాలని వారిని కోరారు. సీటు ధక్కలేదన్న అవమాన భారంతో నందికొట్కూరు, చింతలపూడి ఎమ్మెల్యేలు షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వైసిపికి దళిత ఓటు బ్యాంక్ దూరం కానున్నదా?

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులును ఆయా వర్గాల సంక్షేమానికి కేటాయించకుండా …వేరే పథకాలకు మల్లించారని ఆరోపణ వైసిపి మీద ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని…అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఏకంగా ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నారన్న విమర్శ ఉంది. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా ముద్ర వేయడం వలనే గుండెపోటుతో మరణించారని
దళిత సంఘాలు చాలా ఆగ్రహంగా ఉన్నాయి.ఇటీవలనే దళితుల సిరోమండనం కేసులో మాజీ మంత్రి తోట త్రిమూర్తులకుకు జైలు శిక్ష ఖరారు అయ్యింది.ఆయన మండపేట అసెంబ్లీ వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.మరో పక్క తమ మద్దతు ఎన్డీయే కూటమికే ఉంటుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేసారు. గత ఎన్నికల్లో వైసిపి విజయం కోసం కృషి చేసిన మహసేన రాజేష్ …వైసిపి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయంటూ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశంలో చేరారు.దళితుల్లో వైసిపి మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ…రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి దళితులు మద్దతు తెలపకుండా వైసిపి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.దళితుల ఓట్లను మలుచుకోవడంలో టిడిపికి ప్రధాన సమస్యగా మిత్ర పక్షం బిజెపి ఉంది. మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఘటన దళితులకు బిజెపి పై ద్వేషాన్ని పెంచింది.

బిజెపికి బలం ఉందా? బిజెపి పోటీ ఎవరికి మేలు చేస్తుంది?

రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బిజెపికి ఒక శాతం కంటే తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి. దేశంలో అధికారంలో ఉన్నామంటూ..రాష్ట్రంలో మా ఓట్ల శాతం పెరిగిందంటూ పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఐతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం అసెంబ్లీ నుంచి పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశించారు.పొత్తులో భాగంగా అధి బిజెపి జాతీయ కార్యదర్శి కె.సత్య కుమార్ కు కేటాయించారు. దీనిపై పరిటాల శ్రీరామ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానంలో టీడీపి, జనసేన నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. చివరకి ఆ స్థానం మాజీ కేంద్ర మంత్రి,మాజీ ఎంపీ సుజనా చౌదరిని వరించింది. ఫలితంగా జనసేన పశ్చిమ ఇంఛార్జి పొతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామ చేసి వైసిపికి గూటికి చేరారు.ఇలా బిజెపికి ఇచ్చిన 10 అసెంబ్లీ స్థానాల్లో కైకలూరు, అనపర్తి, విశాఖ నార్త్, జమ్మలమడుగు స్థానాలు మినహా ఆరు స్థానాలు అధికార వైసిపి గెలిచే అవకాశం ఉందని సమాచారం.అందులో భాగంగానే టిడిపి నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలకు వైసిపి భారీ స్థాయిలో ఆఫర్ చేస్తుందని సమాచారం. వారి కార్యకర్తల, అనుచరులు, అభిమానులు ఓట్లను మిత్ర పక్షాలకు బదిలీ అవ్వకుండా…. పరోక్షంగా తమకు మద్దతు తెలపాలని వైసిపి పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.144 స్థానాల్లో టీడిపి,21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన,10 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు పోటీలో ఉన్నారు.టిడిపి పోటీ చేయని 31 స్థానాల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునే దిశగా వైసిపి అడుగులు వేస్తుంది.

Exit mobile version