Home వార్తలు Tirumala: టీటీడీ కీలక నిర్ణయం – వీఐపీ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం – వీఐపీ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ తగ్గే వరకూ వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఇఓ ధర్మారెడ్డి ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో సర్వదర్శనం భక్తులతో వైకుంఠ క్యూకాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. లేపాక్షి మీదుగా అన్నదానం వరకూ దాదాపు రెండున్నర కిలో మీటర్ల మేర క్యూ ఉంటోంది.

శ్రీవారి ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. రాబోయే నాలుగైదు రోజుల్లో రద్దీ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ఇఓ ధర్మారెడ్డి సూచించారు. మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను నిలుపుదల చేస్తున్నామనీ, కావున సిఫార్సు లేఖలతో వచ్చే వారు ఈ విషయాన్ని గమనించాలని ఇఓ ధర్మారెడ్డి కోరారు.

Exit mobile version