Home వార్తలు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారు ? : వర్ల రామయ్య

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారు ? : వర్ల రామయ్య

కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షనర్ దారులకు పెన్షన్ అందించాలని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డిని టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, నక్కా ఆనందబాబు,కన్నా లక్ష్మీ నారాయలతో కలిసి వినతిపత్రం సమర్పించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. పెన్షన్ దారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించాలని కోరారు. పెన్షన్ ల పంపిణీ ప్రక్రియ ఈ నెల ఐదవ తారీఖు లోపు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ అఫిషియల్ పోర్టల్ లో చంద్రబాబు కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్న వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందించే పెన్షన్ లను చంద్రబాబు అడ్డుకున్నారని వైసిపి అసత్య ఆరోపణలు చేస్తుంది అని మండిపడ్డారు. పెన్షన్ లను ఏ విధంగా చంద్రబాబు అడ్డుకుంటారు ? కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని చంద్రబాబు కు ఎలా ఆపాధిస్తారు అని ప్రశ్నించారు.రాష్ట్రంలో పెన్షన్ దారులు ఎవరు అదైర్యపడద్దు,వైసిపి అసత్య ప్రచారాలు, దుష్ప్రచారం నమ్మద్ధు అని విజ్ఞప్తి చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఖజానాలో డబ్బు ఉందా ?

రాష్ట్రంలో పెన్షనర్ లకు నగదు ఇవ్వడానికి రాష్ట్ర ఖజానాలో డబ్బు ఉందా? కాంట్రాక్టర్లకు ,మీ మేనమామ రవీంద్ర నాథ్ రెడ్డి కి ఇవ్వటానికి కాదు..పెన్షన్ లు ఇచ్చేందుకు నగదు ఉందా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

Exit mobile version