Home వార్తలు వైసిపి ఓటమికి సంతకం పెట్టిన జగన్ సిద్ధం సభ : వర్ల రామయ్య

వైసిపి ఓటమికి సంతకం పెట్టిన జగన్ సిద్ధం సభ : వర్ల రామయ్య

రాష్ట్రంలో అధికార వైసిపి పూర్తి ఆర్భాటాలతో హంగులతో బాపట్ల జిల్లా మేదరమెట్ల లో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు లక్ష మంది జనం కూడా రాలేదు. వైసిపి నేతలు మాత్రం 15 లక్షలు వచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. సిద్ధం సభ పూర్తిగా విఫలం అయ్యింది. జగన్ మాటల్లో పేల తనం, ఖంగారు, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు అనే ఆతృత సుస్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఓటమికి సంతకం మేదరమెట్ల సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చేశారని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సోమవారం మంగళగిరి లోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….సిద్ధం సభ ఒక మయ సభ.ఉన్నది లేనట్టుగా..లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కందుకూరు టిడిపి సభలో తొక్కిసలాటలో నలుగురు చనిపోతే ఇద్దరు టిడిపి నాయకులని అరెస్ట్ చేశారు. సిద్ధం సభలో తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయారు. సభకు భాధ్యత వహించిన వైవీ సుబ్బారెడ్డి నీ అరెస్ట్ చెయ్యరా? టిడిపి కి ఒక న్యాయం? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు.రాష్ట్ర డిజిపి చట్టబద్ధంగా వెళ్లాలని పేర్కొన్నారు.వైవీ సుబ్బారెడ్డి నీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

డ్రోన్లు నాటకం ఐ ప్యాక్ పని కాదా ?

సిద్ధం సభలో ఉపయోగించిన డ్రోన్లు ఐ ప్యాక్ చేసిన పని కాదా అని ప్రశ్నించారు. చివరి సభలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తయారుచేసిన మేనిఫెస్టో ను విసిరి కొట్టింది మీరు కాదా ? అని ప్రశ్నించారు.మీరు సిద్ధంగా ఉండండి మీ కలలని నెరవేరుస్తానని అంటున్నారు.

ప్రధాన హామీని మరిచిన జగన్

గత మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేశామని చెపుతున్నారు…మధ్యపాన నిషేధం చేసిన తరువాత ఓట్లు అడగటానికి వస్తాను అని చెప్పింది నిజం కాదా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో పోస్టులను భర్తీ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. మధ్యపాన నిషేధం చేయకపోగా…మహిళలకు న్యాయం చేయకపోగా విపరీతమైన కల్తీ మద్యం లిక్కర్ తాగించి ఎన్ని కుటుంబాలను కూలగొట్టారో రాష్ట్ర మహిలలకు తెలియదు అని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

ఏ ఒక్క పథకం రద్దు చేయము

వాలంటీర్స్ ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన తరువాత వాలంటీర్స్ కు మెరుగైన భవిష్యత్ అందిస్తామని హామి ఇచ్చారు. చంద్రబాబు అధికారం లోకి వస్తే మినీ మేనిఫెస్టో లో ప్రకటించిన ఏ హామీ ని కూడా నెరవేర్చలేరనీ తాను ఇచ్చిన సంక్షేమ పథకాలు ను రద్దు చేస్తారని జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.సంపద సృష్టించడం చంద్రబాబు తెలుసు, ఆర్థిక వ్యవస్థ పై పట్టు ఉన్న నాయకుడు చంద్రబాబు అని తెలిపారు.ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ను అందుకున్నారో వారందరీ కి ఒక్క సంక్షేమ పథకాలు ను రద్దు చేయమని..మెరుగైన రీతిలో మరిన్ని పథకాలతో మంచి చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.

Exit mobile version