Home వార్తలు పది శాతం పనులు పూర్తి చేయటానికి ఐదేళ్లు కూడా సరిపోలేదా ? : భూమిరెడ్డి రాంగోపాల్...

పది శాతం పనులు పూర్తి చేయటానికి ఐదేళ్లు కూడా సరిపోలేదా ? : భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

గత తెలుగుదేశం ప్రభుత్వంలో వెలిగొండ ను ప్రాధాన్యత ప్రోజెక్ట్ గా చేపట్టి రూ. 1450 కోట్లు ఖర్చు చేసి సొరంగాలు దాదాపు పూర్తి చేస్తే…కేవలం పది శాతం పనులను పూర్తి చేయటానికి ఐదేళ్లు కూడా సరిపోలేదా? తాము అధికారంలోకి వస్తే ఒక్క ఏడాదిలోనే వెలిగొండను పూర్తి చేసి ఆ ఫలాలను ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగానికి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడ వైసిపి అధికారంలోకి వచ్చి ఐదేళ్ల అయ్యింది. వెలిగొండ ద్వారా ఐదేళ్లలో ఒక్క ఎకరానికి అయినా సాగు నీరు, ఒక్క గ్రామానికి అయినా త్రాగునీరు ఇచ్చారా అని పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం మంగళగిరి లోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వెలిగొండను తానే పూర్తి చేశానని అసత్యాలు చెబుతూ మీసాలు మెలేసి జాతికి అంకితం చేసందుకు సిగ్గు లేదా అని ధ్వజమెత్తారు. పునరావాసం కింద తమకు న్యాయం చేయాలని సిఎం కి వినతి పత్రాలు ఇవ్వడానికి ఆ ప్రాంత ప్రజలు ప్రయత్నం చేస్తే రైతులను అడ్డుకున్నారని మండిపడ్డారు.

వెలిగొండ ద్వారా లబ్ధి పొందేది రైతంగాం, ఆ రైతులనే సిఎం కార్యక్రమానికి రాకూడదని పోలీసులతో నిర్భధించడం నోటీసులు ఇవ్వడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉంది ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు పరిహారం లేదు కానీ మరో 45 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే…. ప్రోజెక్ట్ ను జాతికి అంకితం చేసి ఆర్భాటం చేస్తే ప్రకాశం ప్రజలు ఓట్లు వేస్తారనే బ్రమలో జగన్మోహన రెడ్డి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెలిగొండ ను అనుమతుల ఉన్న ప్రోజెక్ట్ గా ఇవ్వాలని అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం కు విజ్ఞప్తి చేసాము. జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిను జల వనరుల శాఖ మంత్రి కలుస్తున్నారు కానీ ఎప్పుడైనా వెలిగొండ ను అప్రూవల్ ప్రోజెక్ట్ గా అనుమతించాలి అని కేంద్రాన్ని ఎప్పుడైనా ప్రశ్నించారా అని నిలదీశారు.

పూర్తి కాని ప్రోజెక్ట్ కు, నీళ్ళు నిల్వ లేని ప్రోజెక్ట్ కు జాతికి అంకితం చేస్తూ…జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇస్తున్న సందేశం ఏమిటి? హంద్రీనీవా కాలువల ద్వారా కృష్ణా జలాలను కుప్పం కు తీసుకువచ్చానని జాతికి అంకితం చేశారని చెబుతున్నారు…. ఉదయం నీళ్ళు విడుదల చేస్తే సాయంత్రం కు నీళ్ళు పారలేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత హామీలను తిప్పికొట్టి.. రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Exit mobile version