Home వార్తలు Nara Lokesh: ఉమ్మడి ప్రకాశాన్ని ఫార్మా హబ్ గా అభివృద్ధి చేస్తాం .. వృత్తి నిఫుణుల...

Nara Lokesh: ఉమ్మడి ప్రకాశాన్ని ఫార్మా హబ్ గా అభివృద్ధి చేస్తాం .. వృత్తి నిఫుణుల ముఖాముఖిలో లోకేష్

Nara Lokesh: ఉమ్మడి ప్రకాశాన్ని ఫార్మా హబ్ గా అభివృద్ధి చేస్తాం .. వృత్తి నిఫుణుల ముఖాముఖిలో లోకేష్ టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఇవేళ 169వ రోజు అద్దంకి నియోజకవర్గం గుండ్లాపల్లి క్యాంప్ సైట్ నుండి పాదయాత్ర ప్రారంభమైంది. అంతకు ముందు ముద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద వృత్తి నిపుణులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ వైసీపీ సర్కార్ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ బ్రాండ్ విలువ పెంచే విధంగా కొత్త పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు. ఎన్నో కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో ముందుకు వెళ్తున్నాయని అది ముందుగానే ఆలోచించి ఫైబర్ గ్రిడ్ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారన్నారు.

కంప్యూటర్ అన్నం పెడుతుందా ని అవహేళన చేసిన వాళ్లు ఇప్పుడు ఐటీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారన్నారు. అప్పు చేసి సంక్షేమం చేయడం గొప్ప కాదనీ, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసే సామర్థ్యం రాష్ట్రానికి రావాలని అన్నారు లోకేష్. నిపుణులు అందరూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి రూ.10లు ఇచ్చి రూ.100 లు లాక్కుంటున్నారని మండిపడ్డారు. 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన ప్రారంభించారన్న లోకేష్.. ఆ తర్వాత అమర్ రాజా, రిలయన్స్, లులూ కంపెనీలను తరిమేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో ఒక్క మంచి కంపెనీ అయినా ఏపీకి వచ్చిందా అని ప్రశ్నించారు. జగన్ పాలనలో అన్ని రంగాల నిపుణులు బాధితులేనని అన్నారు. ఎకనామిక్ యాక్టివిటీ పూర్తిగా నిలిపివేసి రాష్ట్రాన్ని ఆర్ధికంగా చితికిపోయేలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిశ్రమలు తీసుకువస్తామని అన్నారు. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తామని లోకేష్ ప్రకటించారు.

యూపీపీఎస్సీ తరహాలో ఏపీపీఎస్సీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. మెగా డీఎస్సీ, పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అందరినీ ఒప్పించి అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాయసీమ ఎలక్ట్రానిక్ అండ్ ఆటోమొబైల్ హాబ్ గా, విశాఖను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా ప్రకటించిందన్నారు. జగన్ పాలనలో ఐటీ మంత్రిని చూస్తుంటే కోడిగుడ్డు గుర్తుకు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కాగా అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు.  

Exit mobile version