Home వార్తలు పీఎస్ఎల్వీ సీ – 56 రాకెట్ ప్రయోగం సక్సెస్ .. శాస్త్రవేత్తల బృందానికి సీఎం జగన్...

పీఎస్ఎల్వీ సీ – 56 రాకెట్ ప్రయోగం సక్సెస్ .. శాస్త్రవేత్తల బృందానికి సీఎం జగన్ శుభాకాంక్షలు

ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ 56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. మొత్తం నాలుగు దశల్లో ఈ ప్రయోగం చేపట్టిన ఇస్రో .. సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో … శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్ లో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఒకే నెలలో ఇస్రో రెండు ప్రయోగాలు చంద్రయాన్ -3, పీఎస్ఎల్వీ – 56 విజయవంతం చేసింది.

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఇవేళ ఉదయం 6.31 గంటలకు పీఎస్ఎల్వీ సీ – 56 ప్రయోగం నిర్వహించారు. సింగపూర్ కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉప గ్రహాలను దీని ద్వారా కక్షలోకి నియో ఆర్బిట్ లోకి ప్రవేశ పెట్టారు. పీఎస్ఎల్వీ సిరరీస్ లో ఇది 58వ ప్రయోగం. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ నిర్దేశించిన కక్షలో రాకెట్ ను విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. సెప్టెంబర్ నెలలో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం చేపడతామని చెప్పారు. అది కూడా పూర్తిగా కమర్షియల్ ప్రయోగమని వెల్లడించారు. కాగా, రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన  సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందనలు తెలిపారు. ఏడు ఉపగ్రహాలతో విజయవంతంగా రాకెట్ ను  ప్రయోగించిన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Exit mobile version