Home వార్తలు వెలిగొండ పూర్తి చేయలేని జగన్ …మూడు రాజధానులు కడతారా ? : చంద్రబాబు

వెలిగొండ పూర్తి చేయలేని జగన్ …మూడు రాజధానులు కడతారా ? : చంద్రబాబు

టిడిపి ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంకు అన్ని ప్రయత్నాలు చేసి ఎనబై శాతం పనులు పూర్తి చేశాం. వైసిపి అధికారం లోకి వచ్చాక డబ్బులకి కక్కుర్తి పడి కాంట్రాక్ట్ ను తప్పించి పనులను ఆలస్యం చేశారు.ఐదేళ్ల పాలనలో ఇరవై శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారా అని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.మూడు ముక్కులాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఆదివారం మార్కాపురం లో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ…గత ఎన్నికల్లో వెలిగొండ పూర్తి చేసిన తరువాతే నే ఓటు అడుగుతాను అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నేడు పూర్తి కాకుండానే పునరావాసం కింద ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండానే పరదాలు చాటున వచ్చి ప్రారంభిస్తారా అని నిలదీశారు.వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే 15 లక్షల మందికి త్రాగు నీరు, 4,50,000 ఎకరాలకు సాగు నీరు వచ్చేది అని పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే 2020 కే నీళ్ళు వచ్చేవి అని తెలిపారు.వెలిగొండ ప్రాజెక్టు కు తానే శంఖుస్థాపన చేసానని…రాబోయే టిడిపి,జనసేన,బీజీపీ ప్రభుత్వంలో ఆ ప్రోజెక్ట్ ను పూర్తి చేసి పశ్చిమ ప్రాంతంలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తానని హామీ ఇచ్చారు. శ్రీశైలం లో నీరు లేకపోయినా గోదావరి నీరు నాగార్జున సాగర్ కు తీసుకురావాలని సంకల్పంతో నదుల అనుసంధానం చేసే విధంగా ముందుకు వెళ్ళాము అని పేర్కొన్నారు.

నొక్కింది ఎంత ? బొక్కింది ఎంత?

ఐదేళ్లలో బటన్ ల ద్వారా నొక్కింది ఎంత? ప్రజల దగ్గర బొక్కింది ఎంత అని ప్రశ్నించారు. బటన్ నొక్కుడు వలన 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.బటన్ నొక్కుడు వలనే పెట్రోల్ ,డీజిల్, సెలస్ టాక్స్ ,అన్ని పెరిగాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.నిత్యావసరాల ధరల తగ్గించడానికి బటన్ నొక్కారా? సిపిఎస్ రద్దుకు బటన్ నొక్కారా? గుంతల రోడ్లు బాగు చేయడానికి బటన్ నొక్కారా? చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి బటన్ నొక్కారా ? సర్పంచులు కు అధికారాలు ఇవ్వడానికి బటన్ నొక్కారా? ఎస్సీ ఎస్టీ, బిసి,మైనార్టీ లకు సబ్ పాలన కింద బటన్ నొక్కారా అని ప్రశ్నించారు.పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దొచేసే జలగ అని మండిపడ్డారు.రాష్ట్రానికి మేలు చేసే పార్టీ ఎది? నష్టం చేసిన పార్టీ ఎది..బేరీజు వేసుకొని ఓటు వేయాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి కలిసి కూటమికి మార్కులు వేయాలని కోరారు. వైసిపి ఐదేళ్ల పాలనలో గుద్దెలే గుద్దులు…బాదుడే బాదుడు..కేసులే కేసులు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు పడిన నరకానికి, సమస్యలకు, కస్టాలకు చెక్ పెట్టే రోజు మే 13 అని అని గుర్తు చేశారు.

టిడిపి తోనే ముస్లింల అభివృద్ధి

ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ రెండో బాషా చేసాము. కార్పొరేషన్ ఏర్పాటు చేశాం..హైదరాబాద్ , కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీ స్థాపించింది తెలుగుదేశం అని పేర్కొన్నారు.రంజాన్ తిఫా ఇచ్చాం.మూడు లక్షలు ఆర్థిక సహాయం చేసి లక్ష సబ్సిడీ ఇచ్చాం.వైసిపి ఐదేళ్ల పరిపాలనలో మైనార్టీ సోదరులకు ఒక్క పని చేశారా అని సవాల్ విసిరారు.

మార్కాపురం కేంద్రంగా జిల్లా

రాబోయే ప్రభుత్వంలో పశ్చిమ ప్రకాశం కు నీళ్ళు తీసుకువస్తాం..మార్కాపురం కేంద్రంగా జిల్లాను చేస్తాం..పరిశ్రమలను తీసుకువచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను అని హామీ ఇచ్చారు.

అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలా ? సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా ?

వైసిపి అధికారంలోకి వచ్చకా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు.రాష్ట్ర అప్పులన్నీ సాక్షి పేపర్ ,భారతి సిమెంట్ లు కడతయా అని నిలదీశారు..అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలా ? సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా ? అని ప్రశ్నించారు.2014_2019 లో సంక్షేమానికి 19 శాతం ఖర్చు పెట్టాం.జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 15.6 శాతం అని వివరించారు.అన్నా క్యాంటీన్, చంద్రన్న భీమా , విదేశీ విద్యా,పండుగ కానుకలు ఇచ్చాం అని గుర్తు చేశారు.సంపద సృష్టిస్తాం…రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం…పెంచినా ఆదాయంతో నే సంక్షేమం పంచుతాం అని హామీ ఇచ్చారు. వేల రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపిస్తాం అని తెలిపారు.నిత్యవసరాల ధరల తగ్గించడానికి బటన్ నొక్కారా? సిపిఎస్ రద్దుకు బటన్ నొక్కారా? గుంతల రోడ్లు బాగు చేయడానికి బటన్ నొక్కారా? చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి బటన్ నొక్కారా ? సర్పంచులు కు అధికారాలు ఇవ్వడానికి బటన్ నొక్కారా? ఎస్సీ ఎస్టీ, బిసి,మైనార్టీ లకు సబ్ పాలన కింద బటన్ నొక్కారా అని ప్రశ్నించారు.పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దొచేసే జలగ అని మండిపడ్డారు.
ప్రజలు గెలవాలి…కూటమి గెలవాలి.

రాష్ట్రంలో ప్రజలు గెలవాలి అంటే కూటమి గెలవవాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలను చదివించుకోవాలి.సాగునీటి ప్రాజెక్టుల నిర్మించుకోవాలి.తెలుగు గడ్డ పై పుట్టిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయటం మా బాధ్యత అని హామీ ఇచ్చారు.రాతి యుగంలో ఉన్నాం..నా పాలన స్వర్ణ యుగం. తానే ఒక డ్రైవర్ గా పని చేస్తాను.మా బస్ లో ఎక్కిన ప్రతి ఒక్కరూ గమ్యాన్ని చేర్చుతాను అని హామీ ఇచ్చారు.

Exit mobile version