Saturday, April 27, 2024
Home వార్తలు గ్రూప్ 1 అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి : చంద్రబాబు

గ్రూప్ 1 అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి : చంద్రబాబు

- Advertisement -

ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డే ప్రధాన ముద్దాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రాజకీయ పునరావాస కేంద్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని అక్రమాలతో విద్యార్థుల కలలను ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిందే కాకుండా….హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులను ఏమనాలని ప్రశ్నించారు. ఐపీఎస్ లు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులుతో పాటు ధనుంజయ్ రెడ్డిపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలన్నారు. ఏపీపీఎస్సీలోని అక్రమాలపై ఉండవల్లిలోని తన నివాసంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…..ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించాలి. దుర్మార్గుల పాలనలో ఎంత బరితెగింపు ఉంటుందో ఇదొక ఉదాహరణ. రాష్ట్ర యువతకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతున్నాయి. యువత ఆశలను చంపి, జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గాలను ఏం చేసినా తప్పులేదు. తెలియక తప్పు చేస్తే క్షమించవచ్చు..కానీ కావాలని యువత గొంతు నులిమే క్రూర మృగాలను క్షమించకూడదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎంపికై ప్రజలకు సేవ చేయాలన్నది కొందరి కల. పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలన్నది వారి ఆలోచన. అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్యమైన పోస్టులు ఇక్కడ నియామకాలు చేస్తారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించడానికి నీతి, నిజాయితీ, సమర్థత ఉన్న వారిని తీసుకుంటారు. నియామకాల్లో రాజీపడితే బోర్డే నాశనం అవుతుంది. నాడు ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ ఎవరో కూడా నాకు తెలీదు…సమర్థులు ఎవరో వడగట్టి మంచి వ్యక్తిని తీసుకున్నాం.’ అని గుర్తు చేశారు.

వైసిపి రాజకీయ పునరావాసంగా ఏపీపీఎస్సీ

- Advertisement -

గౌతమ్ సవాంగ్…ఒక టెయింటెడ్ క్యారెక్టర్ అధికారి. నాడు రాజధాని ప్రాంతానికి నేను వెళ్తుంటే నాపై రాళ్లు, చెప్పులు వేయించారు. కోపంతో కొందరు వచ్చి నిరసన తెలిపారు అని చెప్పిన దుర్మార్గుడు ఈ గౌతమ్ సవాంగ్. ఒక డీజీపీగా నాడు అనే మాటేనా ఇది.? డీజీపీగా తప్పించాక ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ఇది వైసీపీ కార్యాలయమా.? జీ.వి.సుధాకర్ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత. జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభాదాస్ మనవడు సుధీర్…ఇతనే అక్రమాలకు సూత్రదారి..కేంద్ర బిందువు. సోనీవుడ్, సీవీ శంకర్ రెడ్డి, సెలీనా లాంటి చెత్త వ్యక్తులను తీసుకొచ్చి సభ్యులుగా పెట్టారు. తల్లిదండ్రులు పడ్డ కష్టం, ఆశలను నాశనం చేశారు. నేను సీఎంగా ఉన్నప్పుడు 2018 డిసెంబర్ 31న 162 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. 30 డిప్యూటీ కలెక్టర్లు, 28 డీఎస్పీలతో పాటు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు జరిగాయి. కానీ నియామకాలు, సాంప్రదాయాలకు ఈ ప్రభుత్వం తిలోదకాలు తెచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ మూల్యాంకనం చేశారు. అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే మ్యాన్యువల్ మూల్యంకనం చేయాలని జస్టిస్ సోమయాజులు 2021 అక్టోబర్ 1న ఆదేశాలు ఇచ్చారు. నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారో నేను చూశాను. అడ్వకేట్ కోసం చందాలు వేసుకుని పోరాడారు. అయినా వారిని సీతారామాంజనేయులు వేధించారు. హాయ్ ల్యాండ్ లో మ్యాన్యువల్ మూల్యాంకనం కోసం సీతారామాంజనేయులు ఆదేశాలు ఇచ్చారు. గౌతమ్ సవాంగ్ వచ్చాక…2021 డిసెంబర్, 2022 ఫిబ్రవరిలో జరిగిన మాన్యువల్ వ్యాల్యూషన్ ఫలితాలు తొక్కిపెట్టి నచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. మొదటి సారి చేసిన వ్యాల్యూషన్ వివరాలు దాచిపెట్టి రెండో సారి వ్యాల్యూయేషన్ చేయాలని గౌతమ్ సవాంగ్ ప్రభుత్వానికి రికమెండ్ చేశాడు. ఇది ఏపీపీఎస్సీ రూల్ నెంబర్ 3(9)కి వ్యతిరేకం. మొదటి సారి చేసిన వ్యాల్యూషన్ వివరాలు దాచిపెట్టి 2022 మార్చిలో వ్యాల్యూయేషన్ ప్రారంభించినట్లు కోర్టకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. రెండోసారి వ్యాల్యూషన్ కు ఇచ్చినట్లు డాటాటెక్ మెథడెక్స్ కు సీతారామాంజనేయులు రాసిన లేఖే ఆధారం. స్ట్రాంగ్ రూములు వద్ద తగిన భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి 03.12.2021న లేఖ రాశారు. హాయ్ ల్యాండ్ లో మాన్యువల్ వ్యాల్యూషన్ కు వచ్చిన అధికారులకు భోజనం ఖర్చులకు రూ.20 లక్షలు ప్రభుత్వం సొమ్మును ఆవాస రిసార్ట్ కు చెల్లించారు. డేటాటెక్ మెథడెక్స్ కు పోస్ట్ వ్యాల్యూషన్ కోసం రామాంజనేయులు లేఖ రాశారు. 2022లో ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేస్తారని సొంత పత్రిక సాక్షిలో కూడా ముందుగా కథనాలు వచ్చాయి. తప్పుడు వార్తలు రాయడానికి, రాష్ట్రాన్ని మోసం చేడానికి, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఈ సాక్షి. డిజిటల్ వ్యాల్యూషన్ తప్పు అని కోర్టు మొట్టికాయలు వేసి మాన్యూవల్ వ్యాల్యూషన్ చేయాలని చెప్పింది. కావాల్సిన మనుషులు కోసం ఫలితాలు తొక్కిపెట్టారు. తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకు సవాంగ్ చైర్మన్ అయ్యాక ఆదేశాలు వచ్చాయి. కనీసం భయం కూడా లేకుండా విచ్చిలవిడి తనంతో ప్రవర్తించారు. చట్టాన్ని ఉల్లంఘించడానికి అధికారం లేదు. చట్ట ప్రకారం పని చేస్తే ఉంటారు..లేదంటే శిక్షకు గురవుతారు. అవసరమైతే ఇలాంటి దుర్మార్గులను జైల్లో పెడితేనే పిల్లల జీవితాలు బాగుపడుతాయి.’ అని పిలుపునిచ్చారు.

- Advertisement -

కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిన అధికారులను ఏమనాలి.?

- Advertisement -

‘కోర్టులంటే లెక్కలేని తనం. తప్పు చేయాలంటే ఆత్మ క్షోభిస్తుంది…అయినా బరి తెగించి ప్రవర్తించారు. పిల్లల భవిష్యత్ కు మరణ శాసనం తాడేపల్లి కొంపలోనే ప్రారంభమైంది. ఆల్ ఇండియా సర్వీస్ కు గౌతమ్ సవాంగ్ అనర్హుడు. రేపు అనేది ఆలోచించకుండా సైకో ఏం చేయమంటే ఆది చేస్తున్నారు. సైకో చంపేయమన్నా చంపేస్తారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని లాయర్లకు ఖర్చు పెట్టి నాశనం చేస్తున్నారు. లాయర్లకు ఈ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టింది. 2022 మార్చి 25 నుండి మాన్యూవల్ వ్యాల్యూషన్ జరిగిందిన కోర్టుకు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. ఇలాంటి సిగ్గులేని పనులు చేసినందుకు ఉరేసుకుని చనిపోవాలి. రెండోసారి జనవరి 2023న మరొక అఫిడవిట్ దాఖలు చేసి అదే అబద్ధాన్ని మళ్లీ చెప్పారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం మళ్లీ అప్పీల్ కు వెళ్తామని చెప్తోంది. ఎందుకు వందల కోట్ల ప్రజల డబ్బులు తగబెట్టడానికా.? ఇలా తప్పులు చేసుకుంటూ పోతూనే ఉంటే ప్రజలు మిమ్మల్ని స్మశానానికి పంపుతారు. అక్రమ నియామకాలు చెల్లవని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా సిగ్గులేకుండా కోర్టుకు వెళ్తామని అంటున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగడానికి అర్హత ఉందా.? తప్పులు చేసింది కాకుండా మళ్లీ బుకాయిస్తున్నారు. ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపి నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ తప్పులు తెలియక చేసినవి కావు…కావాలని చేసినవి. తప్పు ఇది. ఈ ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి. అక్రమంగా ఎంపికైన వారిని విధుల్లో లేకుండా చేయాలి. ఏపీపీఎస్సీ అక్రమాలపై కోర్టు తీర్పును సైట్ లో పెట్టకుముందే ఉద్యోగుల తరపున అప్పీల్ కు వెళ్తామని ముందే చెప్పారు.’ అని తప్పుబట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

Most Popular

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...