Saturday, April 27, 2024
Home వార్తలు పాలించే నాయకులు కాదు…ప్రశ్నించే గొంతుక కావాలి : రేవంత్ రెడ్డి

పాలించే నాయకులు కాదు…ప్రశ్నించే గొంతుక కావాలి : రేవంత్ రెడ్డి

- Advertisement -

రాష్ట్రంలో టిడిపి,వైసిపి ప్రభుత్వాల పదేళ్ల పాలనలో పోలవరం పూర్తి కాలేదు…రాజధాని ఎక్కడ ఉందో చెప్పలేని పరిస్థితి. అధికార ,ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.రాష్ట్రంలో ఢిల్లీ కి వెళ్లి వంగి వంగి దండాలు పెట్టే నాయకులు ఉన్నారు తప్ప… ఢిల్లీ ను అడిగి సమస్యల్ని సాధించే నాయకులు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుక ఉన్నప్పుడే పాలకులు మాట వింటారు. రాష్ట్ర హక్కుల కోసం,ప్రజల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు రానున్న ఎన్నికల్లో అండగా నిలబడాలని కోరారు. శనివారం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రక్షణ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సాధన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. 32 మంది ఆత్మ బలిదానాలుతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది అని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి సుల్తాన్ లు..జమీందారు లు వచ్చినా…తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్లను తియలేరు.విశాఖ ఉక్కును ఇంచ కూడా కధపలేరు అని హెచ్చరించారు.

రాష్ట్రంలో .. మోదీ దైర్యం, బలం, బలగం ఏమిటి ?

- Advertisement -

రాష్ట్రంలో ప్రధాన ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు అయిన బాబు జగన్ పవన్ లు మోదీ బలం, బలగం. ఎవరు గెలిచినా మోదీ కి మద్దతు ఇస్తారు.ఇక రాష్ట్ర ప్రజలకు మోదీ ఏమీ చేస్తారు? రాష్ట్ర హక్కుల కోసం మోదీని బాబు జగన్ పవన్ నిలదిస్తారా? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెస్తారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

నిజమైన వైయస్ఆర్ వారసులు ఎవరు ?

- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లతో అధికారంలో తీసుకురావాలని..రాహుల్ గాంధీ నీ ప్రధాన మంత్రి నీ చేయాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చివరి వరకు పోరాడారు. బిజెపి కి వ్యతిరేఖంగా పోరాడారు. సెక్యులర్ ఫోర్సెస్ కు వెనకాల నిలబడ్డాడు. కమ్యునల్ ఫోర్సెస్ కు అంటగాకలేదు. అధికారం ఉన్నా..లేకపోయినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా…ప్రజాస్వామిక వాదిగా నిలబడ్డాడు. వైయస్సార్ వారసులు అని చెప్పుకునే వారు నేడు ఎవరి పక్కన నిలబడ్డారు? ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారు? మోదీ కి అండగా నిలబడి సెల్యులార్ గా ఉన్న రాష్ట్రాన్ని కమ్యునల్ చేతిలో పెట్టదలచుకున్నారా అని ప్రశ్నించారు. గోద్రా లో అల్లర్లు జరుగుతుంటే..రాజశేఖర్ రెడ్డి మోదీ మీద పొరాడారు. నేడు….మణిపూర్ లో లక్షలాది మంది నిరాశ్రయలు అయ్యి ..వేలాది మందిని హత్య చేస్తుంటే మోదీ ప్రభుత్వాన్ని ఒకసారైనా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారా అని నిలదీశారు. వైయస్సార్ కు నిజమైన వారసురాలు షర్మిళ అని తెలిపారు. రాష్ట్ర హక్కుల కోసం పొరాడాలంటే చట్ట సభల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించాలి. రానున్న ఎన్నికల్లో 25 ఎమ్మెల్యేలు,ఐదు ఎంపిలను ఇవ్వండి.. విశాఖ ఉక్కు కోసం కోట్లాడ్తుది, రాష్ట్ర హక్కుల కోసం షర్మిల ప్రశ్నిస్తారు అని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

Most Popular

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...