Home వార్తలు లౌకికవాద పరిరక్షణ కోసం బిజెపిని ఓడించండి : ఆవాజ్ కమిటీ

లౌకికవాద పరిరక్షణ కోసం బిజెపిని ఓడించండి : ఆవాజ్ కమిటీ

దేశంలో లౌకిక వాద పరిరక్షణ కోసం బిజెపిని, రాష్ట్రంలోని బిజెపితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు తెలిపే పార్టీలను ఓడించండి. ఇండియా కూటమి లోని లౌకిక పార్టీలను వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ఏ సుభాన్, ఎం ఏ చిస్టి ఒక ప్రకటనలో కోరారు. శనివారం ఆన్లైన్ లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగినట్లు వారు తెలిపారు. బిజెపి అధికారంలో వచ్చినప్పటి నుంచి మైనారిటీలపై దాడులు…. అజాన్,నమాజ్,హలాల్, హిజాబ్, యు సి సి, లవ్ జిహాద్, ఘర్ వాపసి,గోరక్షణ అంటూ అనేక రకాల దాడులు చేస్తుందన్నారు. దేశ బడ్జెట్లో కేటాయింపులో కోత వివిధ పథకాల నిలిపివేత, స్కాలర్షిప్లలో కుదింపులు అంటూ ఆర్థిక దాడులు కూడా చేస్తుంది.ఇంతకంటే దుర్మార్గంగా మత ప్రాతిపదికన పౌరసత్వం అంటూ ముస్లింల ఉనికే ప్రమాదంలోకి నెట్టి వేయబడే ఎన్ఆర్సి ఎన్పీఆర్ సిఏఏ లాంటి చట్టాలను తెచ్చిందని ఆరోపించారు. మూడు రైతు నల్ల చట్టాలు,నాలుగు లేబర్ కోడ్ లు,నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల,దళితులు మహిళలు గిరిజనులపై దాడులలో కేవలం మైనారిటీలే కాకుండా యావత్తు దేశంలోని అన్ని తరగతుల ప్రజల పైన నిరంకుశత్వం వైఖరితో పాలన సాగిస్తుందన్నారు.మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా స్టార్ట్ అప్ ఇండియా ఆత్మ నిర్భారత్ వికసిత భారత్ అంటూనే ఆచరణలో అదాని భారత్ అంబానీ భారత్ గా మార్చే ప్రయత్నం చేస్తుందని యావత్ దేశమే ప్రమాదంలో నెట్టి వేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.కనుక ఈ దేశ రాజ్యాంగాన్ని లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈఎన్నికలలో బిజెపి ఎన్డీఏ కూటమిని ఓడించడమే తక్షణ కర్తవ్యమన్నారు.

రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న టిడిపి,వైకాపా రెండు పార్టీలు కేంద్రంలోని బిజెపి ప్రవేశపెట్టే ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ ఏ ఒక్కటి మినహాయింపు లేకుండా సమర్ధించడం జరిగిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీలపై దళితులపై దాడులు జరుగుతుంటే ఖండించకపోవడం గర్హనీయం అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపితో అంట కాగడం తప్ప రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా విభజన హామీ అమలు సాధించే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. వామపక్షాల శక్తి పరిమితంగా ఉన్నప్పటికీ దేశంలోనూ రాష్ట్రంలోనూ మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా నికరంగా నిలబడి పోరాటం చేస్తున్నాయన్నారు. అందువల్ల అటు దేశంలో బిజెపి కూటమిని ఇటు రాష్ట్రంలో వైకాపా టీడీపీ జనసేన బిజెపి కూటమిని ఓడించి వామపక్ష అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

Exit mobile version