Sunday, April 28, 2024
Home వార్తలు చిటికెన వేలంత రావణాసురుడిని గద్దె దిపడం కష్టమా? : పవన్ కళ్యాణ్

చిటికెన వేలంత రావణాసురుడిని గద్దె దిపడం కష్టమా? : పవన్ కళ్యాణ్

- Advertisement -

నా చుట్టూ బంగారం తో కట్టిన లంక ఉంది.వజ్రా వైడుర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది. ధీరులు శూరులు తో నిండిన నన్ను ఎవరూ ఏమి చేయలేరన్న అహంకారంతో ఉన్న రావణాసురుడిని ….నార చీర కట్టుకొని నేల మీధ నిలబడిన శ్రీరాముడు బాణంతో చంపేశారు. ఐదేళ్లుగా రాష్ట్రాన్ని రావణకాష్టం వలే చేసిన చిటికెన వేలంత రావణాసురుడిని పదవి నుంచి తిసేయటం మనకు కష్టమా అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ధ బొప్పూడి లో లో టిడిపి, జనసేన, బీజీపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు అయిన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…హిమాలయాల నుంచి గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి ఎలా స్వేదరించిందో … ఎన్డీయే పునర్ కలయికతో రాష్ట్రానికి వచ్చిన మోదీ రాక వలన ఐదు కోట్ల మంది ప్రజల్లో ఆనందాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో అమరావతి దేదిప్యమానం గా వెలిగెందుకు అండగా నిలబడి భరోసా ఇచ్చేందుకు మోదీ రాష్ట్రానికి వచ్చారు అని తెలిపారు.పదేళ్ల క్రితం తిరుపతి బాలాజీ వెంకటేశ్వర సాక్షిగా పొత్తు మొదలు అయ్యింది.. 2024 బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోనుంది అని తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా అభివృద్ధి లేక దాష్టీకంతో దోపిడీ, అవినీతి, అప్రజాస్వామిక విధానాలతో నలుగుతూ కొట్టామిట్టాడుతున్నదని మండిపడ్డారు.

అక్రమ ఇసుక, మద్యంలతో లక్ష కోట్ల దోపిడీ

- Advertisement -

సంపూర్ణ మధ్య పాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి …మద్యాన్ని వ్యాపారం గా మార్చుకున్నారని అని ద్వజమెత్తారు. మద్యం ద్వారా రూ.1,13,580 కోట్ల రూపాయలు ఐదేళ్లలో సేల్స్ సాధించి 84,050 వేల కోట్ల మాత్రమే వచ్చాయని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. జెపి వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు ఐదుగురు రూ. 40, 000 కోట్ల ఇసుక దోచేశారు..ఇదేమిటి అని అడిగిన జర్నలిస్ట్ ను హత్య చేసారని మండిపడ్డారు. 2019 _2021 మధ్య 30,196 మహిళలు అదృశ్య మయ్యరని పార్లమెంట్ లో రాజ్యసభ హోమ్ శాఖ సహాయ మంత్రి అజాయ కుమార్ మిశ్రా ప్రకటించారని గుర్తు చేశారు. వారిలో 7918 మంది 18 ఏళ్ల లోపు యువతులు. 22, 278 మంది 18 ఏళ్ల దాటిన వారు ఉన్నారన్నారు.

- Advertisement -

రాష్ట్ర పెట్టబడులపై వేధింపులు

- Advertisement -

ఆత్మ నిర్భర భారత్ కింద విదేశాల నుంచి వచ్చే సంస్థలు వస్తుంటే…ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన సంస్థలు పరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అమర రాజా ,ఫ్రాంక్లిన్ టెంపుల్టెన్, రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ లు వేధింపులకు తట్టుకోలేక పక్క రాష్ట్రాలకు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి 2019 లో 10.24 శాతం ఉండగా…వైసిపి పాలనలో మైనస్ కు వెళ్లిందని విరుచుకుపడ్డారు.

ధర్మం దే విజయం, పొత్తుదే గెలుపు.కూటమిదే పీఠం

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న వారిపై కక్ష కట్టారు. బిజెపి కార్యకర్తలను పొట్టలో కత్తులు గుచ్చి పేగులు బయటకి తీశారు….వైయస్ వివేకానంద రెడ్డి నీ మర్డర్ చేసిన ప్రభుత్వం.చంద్రబాబు ను ఇబ్బందులకు గురి చేశారు. అడ్డగించిన ప్రభుత్వం….తన ను అనేక పర్యలను అడ్డుకుందని… ఈ అరాచకాలను ఆపాలంటే వైసిపిని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. గుజరాత్ నుంచి వచ్చిన మోదీ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యం పూరిస్తారు.ఎన్నికల కురుక్షేత్రం యుద్ధ ఫలితంలో ధర్మం దే విజయం, పొత్తుదే గెలుపు.కూటమిదే పీఠం అని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

Most Popular

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...