Home వార్తలు Modi Rice: రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్..

Modi Rice: రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్..

Modi Rice: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభ వార్త అందించింది. మోడీ ఉచిత బియ్యం పంపిణీని మార్చి వరకూ కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేపట్టిన సంగతి తెలిసింది. కార్డులోని ప్రతి వ్యక్తికి 5కేజీల వంతున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. గత సంవత్సరం మే నెల నుండి నవంబర్ వరకూ పీఎంజీకేఏవై పథకం కింద ఈ ఉచిత బియ్యం పంపిణీ స్కీమ్ అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ ఏడాది మార్చి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గత నెల డిసెంబర్ కోటాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి బియ్యం పంపిణీకి ఉత్తర్వులు రాకపోవడంతో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉచిత బియ్యం (పీఎంజికేఏవై) పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి 29వ తేదీ వరకూ ఉచిత బియ్యం పంపిణీని రేషన్ ద్వారా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ లోగా రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలకు పీడీఎస్ గోడౌన్ ల నుండి పిఎంజికేఏవై బియ్యం తోలకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల కోటా 5 కేజీల బియ్యంతో పాటు డిసెంబర్ నెల కోటా 5 కేజీలు కూడా కలిపి పది కేజీల బియ్యం వంతున పంపిణీకి ఆదేశాలు ఇచ్చింది.  

Exit mobile version