Sunday, April 28, 2024
Home వార్తలు జగన్ రెడ్డి పతనానికి చిలకలూరిపేటలో పునాది

జగన్ రెడ్డి పతనానికి చిలకలూరిపేటలో పునాది

- Advertisement -

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 17 న టిడిపి, జనసేన, బీజీపీ ఆధ్వర్యంలో జరిగే సంయుక్త సభ ద్వారా విధ్వంసకర జగన్ రెడ్డి p ప్రభుత్వ పతనానికి పునాది వేయబోతున్నామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోమ్మారెడ్డి పట్టాభి రామ్ తెలిపారు. సంయుక్త సభ కు సంబంధించి ఏర్పాట్లపై మూడు పార్టీల కీలక నేతలు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ….ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా సభ ఉంటుందని తెలిపారు. మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు సభ వేదిక మీద నుంచే ఎన్నికలకు సమర శంఖారావం పూరించినున్నారని పేర్కొన్నారు. ఆర్టీసి తరుపున ఇబ్బంది కూడా తొలగిపోయిందని.. బస్ లు ఏర్పాటు చేయటానికి వారు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యం కాలేజీలు కూడా బస్ లను ఏర్పాటు చేయాలని కోరారు. బుధవారం చిలకలూరిపేట వద్ధ బొప్పూడి గ్రామ పరిధిలో సభ కు సంబధించిన భూమి పూజా కార్యక్రమాల్లో మూడు పార్టీల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జివి రెడ్డి మాట్లాడుతూ…..సభకు 15 లక్షల మంది హజరు అయ్యే విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా 13 కమిటీలతో నిర్వహణ చేస్తున్నామని పేర్కొన్నారు. మీటింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుందని, సభ కు ప్రధానమంత్రి హజరు కానున్న నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా వేదిక మీద మూడు పార్టీల నుంచి 50 మంది కే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

- Advertisement -

బిజెపి మహిళ మోర్చ అధ్యక్షురాలు యామిని శర్మ మాట్లాడుతూ…. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చడానికి సిఎం జగన్ చెబుతున్నారని…కానీ…99 శాతం సహజ వనరులను దోచుకున్నారని ఎద్దేవా చేశారు.రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇచ్చింది అని పేర్కొన్నారు. జనసేన నాయకులు హరి మాట్లాడుతూ….రాష్ట్ర ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారో ఆరోజే రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ, స్వాంత్రాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం త్రిమూర్తులు కలిశారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

Most Popular

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...