Home వార్తలు వైసిపి ప్రజా ప్రతినిధులను ఏ.సి.బి ఎందుకు రక్షిస్తుంది ? : మనోహర్

వైసిపి ప్రజా ప్రతినిధులను ఏ.సి.బి ఎందుకు రక్షిస్తుంది ? : మనోహర్

రాష్ట్రంలో మంత్రులు, వైసిపి నాయకులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల అవినీతి గురించి వచ్చిన ఫిర్యాదులుపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ తీసుకున్న చర్యలు ఏమిటి ? రాష్ట్ర డిజిపి గా,ఎసిబి డిజి గా వ్యవహరిస్తున్న వ్యక్తి వీటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఐదేళ్లలో వచ్చిన ఫిర్యాదుల వివరాలు ప్రజలకు ఎందుకు వెల్లడించలేదని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. శుక్రవారం మంగళగిరి లోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర డిజిపి, ఏపి ఎసిబి అధికారి ఎవర్ని రక్సిస్తున్నారు? మంత్రుల అవినీతిని చూసిన అధికారులే ఆశ్చర్యపోయి… ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి జరుగుతున్నా…తమ ప్రభుత్వంలో రూపాయి కూడా అవినీతి జరగలేదని బహిరంగ సభల్లో ఏ విధంగా చెబుతున్నారని నిలదీశారు. అవినీతి పై ఐదేళ్లుగా అందిన ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తక్షణమే గణాంకాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో అవినీతిపై ముఖ్యమంత్రి తప్పుడ గణాంకాలు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.అధికారం మొత్తం కొంత మంది చేతుల్లో కేంద్రీకృతం గా ఉంది.ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.చిత్తశుద్ధితో పనిచేసే అధికారులని నలిపేస్తున్నారు. అధికార యంత్రాంగంతతో ఎన్నికలను దుర్వినియోగం చేసే ప్రయత్నాన్ని భారత ఎన్నికల కమిషన్ గమనించాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలక్షన్ కమిషన్ తప్పకుండా వీటిపై స్పందిస్తుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.

14400 కు 8,03,612 ఫిర్యాదులు

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేసిన 14400 నంబర్ కు 8,03,612 ఫిర్యాదులు వచ్చాయి . మంత్రులు, వారి పేశిలపై 2,16,803 ఫిర్యాదులు వచ్చాయి. అధికార వైసిపి నాయకుల మీద 4,39,679 ఫిర్యాదులు అందితే ఎవరిపైనా కేసులు నమోదు చేశారు అని ప్రశ్నించారు. చిన్న చిన్న అధికారులు మండల స్థాయి అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు మీద ఎసిబి అధికారులు తో దాడులు చేయించారు కానీ అధికార పార్టీ నాయకుల మీద అందిన ఫిర్యాదులపై ఏమీ చేశారని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ లో ఎసిబి డిజి ఎవరు అని ప్రశ్నించారని అంటే ఎవరు ఏ శాఖకు అధికారి అని పరిపాలనపై అవగాహన ఆయనకు లేదని ఎద్దేవా చేశారు.ఒక మంత్రి ఒక సీనియర్ అధికారాన్ని పిలిపించి వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డమని అధికారిపై ఒత్తిడి తెచ్చారు. రేషన్ అందలేదని ఫిర్యాదు చేస్తేనే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ వెళ్ళి బెదిరిస్తున్నారు. అలాంటి భయానక పరిస్థితుల్లో కూడా ప్రజలు స్పందించి లక్షల్లో ఫిర్యాదు లు చేస్తే మీరు తీసుకున్న చర్యలు ఏమిటి ? అవినీతి నిరోధక శాఖ ప్రతి సంవత్సరం అందిన ఫిర్యాదులపై వివరాలు ప్రకటిస్తాయని ….కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వివరాలు ఏమీ ఇవ్వడం లేదని తెలిపారు.

Exit mobile version