Home వార్తలు మహిళా రక్షణకై అత్యధిక ప్రాధాన్యత : రాజేంద్రనాథ్ రెడ్డి .

మహిళా రక్షణకై అత్యధిక ప్రాధాన్యత : రాజేంద్రనాథ్ రెడ్డి .

రాష్ట్ర డి‌జి‌పి ప్రధాన కార్యాలయంలో సి‌ఐ‌డి, ఎఫ్‌ఎస్‌ఎల్, సాంకేతిక విభాగం లో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా సిబ్బందిని డి‌జి‌పి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరి లోని డి‌జి‌పి కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మహిళలు అన్నీ రంగాల్లో తమ శక్తి ని చాటుతున్నారని… అందుకు ఉదాహరణ అత్యంత కీలకమైన , డిఆర్డిఒ,ఇస్క్రో ,చంద్రయాన్ వంటి కీలకమైన వాటిలో ప్రాజెక్టు డైరెక్టర్ గా విజయవంతంగా ముందుకు వెళ్తున్నారని వివరించారు. రాజకీయాల్లో సైతం మహిళలు జెడ్పీటీసీ, ఎంపిటిసి సర్పంచ్ వంటి అనేక పదవులలో కొనసాగుతూ తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందని అన్నారు. మహిళలపై జరిగే నేరాల ఫిర్యాదుల కోసం దిశ పోలీస్ స్టేషన్లు , వేదింపుల నుండి రక్షణ కల్పించడానికి దిశ అప్ ను అందుబాటు లోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.దిశ మొబైల్ అప్లికేషన్ ద్వారా రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశ పెట్టిన దిశా మొబైల్ అప్లికేషన్ (SOS) అత్యంత స్వల్ప వ్యవధి లోనే 1,30,00,000 మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక గొప్ప విశేషం అన్నారు. పోలీసు ప్రధాన కార్యాలయం లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తమ ఫోన్ లో దిశ అప్లికేషన్ ను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యల ద్వారా ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తున్నాయి.

మహిళా పర్వతారోహణరాలుని అభినందించిన డి‌జి‌పి .

పోలీస్ ప్రధాన కార్యాలయంలో అకౌంట్స్ విభాగంలో JAO గా విధులు నిర్వహిస్తూ ఇప్పటికే ఆరు సార్లు హిమాలయ పర్వతలను అవరోదించి ప్రత్యేక ప్రతిభ కనబరిచిన పద్మావతిని డిజిపి అభినందించారు. రూ. 25,000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.త్వరలో పద్మావతి అవరోదించబోయే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు సంబంధించి కావల్సిన వైద్య పరీక్షలు, ఇతరత్రా సౌకర్యాలను పోలీస్ శాఖ సహాయ సహకారాలను అందిస్తుందని అందుకు కావలసిన వివరాలను సంబంధిత అధికారులకు సమర్పిస్తే తగు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డి‌జి శంకర బాత్ర బగ్చి , సిఐడి అడిషనల్ డీజి సంజయ్, డి‌ఐ‌జి రాజకుమారి, టెక్నికల్ సర్వీసెస్ డిఐజి లక్ష్మి తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version