Home వార్తలు Guntur Rave Party: బర్త్‌డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు ..! 25 మందిపై కేసు నమోదు..!...

Guntur Rave Party: బర్త్‌డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు ..! 25 మందిపై కేసు నమోదు..! సీసీఎస్ సీఐపై సస్పెన్షన్ వేటు..!!

Guntur Rave Party: అశ్లీల నృత్యాలను నిరోధించాల్సిన ఓ పోలీస్ అధికారే పార్టీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారులు సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. గుంటూరులో రేవ్ పార్టీ కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఆ పార్టీలో పాల్గొన్న అర్బన్ సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్ లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

అయితే ఈ వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడంతో పాటు విజయవాడ నుండి పిలిపించిన ఆరుగురు యువతులతో కొందరు అసభ్య నృత్యాలు చేశారు. రెస్టారెంట్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో  పట్టాభిపురం పోలీసులు రెస్టారెంట్ పై ఆకస్మిక దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 25 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై వారిని విడుదల చేశారు. అయితే ఈ పార్టీలో పాల్గొన్న వారిలో పోలీసుల పిల్లలు, ప్రముఖుల తనయులు ఉండటం వల్ల పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయకుండా లాబీయింగ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. పార్టీలో ప్రముఖుల పిల్లలు ఉన్నా వారిపైనా కేసులు నమోదు చేశామని చెబుతున్నారు.   

Exit mobile version