Home వార్తలు దేశానికే సవాల్ గా బిజెపి మతోన్మాదం : షర్మిల

దేశానికే సవాల్ గా బిజెపి మతోన్మాదం : షర్మిల

కేంద్ర బిజెపి నియంతృత్వ పదేళ్ల పాలనలో ఆ పార్టీ సృష్టించిన మతోన్మాదమే నేడు భారతదేశానికి అతి పెద్ద సవాల్ గా మారిందని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు. ఇండియా భాగస్వామ్య పార్టీల, సారూప్య రాజకీయ రైతు కార్మిక, మహిళ , ప్రజా సంఘాల ఐక్య వేదిక సమావేశం గురువారం విజయవాడలోని బాలోత్సవ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ…ప్రతి ఎన్నికల వేళ పుల్వామ దాడి, హిజాబ్, రామ్ మందిరం వంటి మత అంశాలు, దేశ భద్రత ల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి, మనసుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజీపీ యత్నిస్తోంది అని మండిపడ్డారు. గతంలో జరిగిన గోద్రా మారణహోమం, మణిపూర్ లో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి బిజెపి ఆ మంటల్లో చలి కాచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి చేస్తున్న మోసాన్ని దేశ ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈడి,సిబిఐ,ఐటి లను తమ సొంత ప్రవేట్ సైన్యంగా భావిస్తూ ప్రతిపక్ష సభ్యుల మీద దాడులు చేయుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రోరల్ బాండ్ల పై వాస్తవాలను బయట పెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటకి బిజెపిని కాపాడే విధంగా ఎస్బిఐ వ్యవహరించింది అని అని మండిపడ్డారు.

రాష్ట్రానికి ఎం చేశారని వంగి వంగి నమస్కారాలు ?

విభజన తరువాత కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మోదీ కి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారని ప్రశ్నించారు.రాష్ట్రానికే తలమానికం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేట్ పరం చేసేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడటం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభ సీట్ల దగ్గర నుంచి టిటిడి లో పదవులు వరకు బిజెపి అడిగిందే తడువుగా వైసిపి ఇస్తుందని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేక పోవడానికి పాలక, ప్రతిపక్ష పార్టీలే కారణం అని ధ్వజమెత్తారు.రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమిను, బీజీపీ కి పరోక్షంగా మద్దతు తెలుపుతున్న వైసిపి ని ఓడించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Exit mobile version