Home వార్తలు చంద్రబాబు డవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారు ? : జగన్మోహన్ రెడ్డి

చంద్రబాబు డవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారు ? : జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో ఆయన పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తుకువస్తుందా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ప్రకాశం జిల్లా కొండేపీ నియోజకవర్గం లోని టంగుటూరు మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపిలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పథకాలు కొనసాగింపుకు….పథకాలు ముగింపు కు మధ్య జరగనున్న ఎన్నికలని స్పష్టం చేశారు. 58 నెలలుగా మంచి చేసిన జగన్ ఒక పక్కన ఉన్నారు.తన అనుకూల మీడియాతో డవలప్మెంట్ కింగ్ అని డబ్బా కొట్టించుకొనే పెత్తందారీ చంద్రబాబు మరో పక్కన ఉన్నారని వివరించారు.2014 లో బాబు వస్తే జాబు వస్తుందని అసత్య హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్లలో కేవలం 32,000 ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి 58 నెలల పరిపాలనలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చామని తెలిపారు.

చంద్రబాబు పాలన బోగస్….మీ జగన్ పాలన ప్రోగ్రెస్

రైతు రుణమాఫీ చేసి బ్యాంకులో బంగారం విడిపిస్తామని అన్నారు. ఐదేళ్లలో 87, 612 కోట్లను మాఫీ చేశారా? రైతులకు పంటల భీమా ఇచ్చారా? సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఉందా ? సున్నా వడ్డీ రుణాలు ఇచ్చిన సందర్భం ఒక్కటైనా ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాతనే పగటిపూట 9 గంటలు విద్యుత్ ఇచ్చాం.సీజన్ ముగిసెలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం.గ్రామ స్వరాజ్యం కు అర్థం చెబుతూ 15,000 గ్రామ వార్డ్ సచివాలయాలను తీసుకొచ్చాం.రైతు భరోసా, విలేజ్ క్లినిక్ లు తీసుకువచ్చాం.17 మెడికల్ కాలేజీలు, 4 సీ పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్ లు కట్టించాం.ఉద్ధానం సమస్యను పరిష్కరించాం.వెలిగొండ కు నీరు తీసుకువచ్చామని తెలిపారు. నాడు నేడు కింద ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిగా మార్చేసాం. అతి త్వరలోనే గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు రాబోతున్నాయి అని పేర్కొన్నారు.ఇంత అభివృద్ధి చంద్రబాబు తన పాలనలో చేశారా? చంద్రబాబు డవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారని ప్రశ్నించారు.డవలేప్మెంట్ విషయంలో చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అని…58 నెలలుగా మీ జగన్ చేసిన పరిపాలన కళ్లెదుటే కనిపిస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ అని వెల్లడించారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే పడుకున్న చంద్రముఖి నిద్ర లేస్తుంది.ఐదేళ్లు మీ రక్తం త్రాగేందుకు తలుపులు కోడ్తుంది అని హెచ్చరించారు.పేదవాడి భవిష్యత్ మారలన్నా…వ్యవసాయం, ఆసుపత్రులు మెరుగుపడలన్నా రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు.

Exit mobile version