Home వార్తలు CM Jagan: ఏపిలో అవినీతి ప్రక్షాళనకు ప్రత్యేక ఏసీబీ యాప్

CM Jagan: ఏపిలో అవినీతి ప్రక్షాళనకు ప్రత్యేక ఏసీబీ యాప్

CM Jagan: అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.  బుధవారం హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దిశ తరహాలోనే అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ ప్రత్యేక యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో యాప్ రూపకల్పన చేయాలని తెలిపారు. అదే విధంగా మండల స్థాయి వరకూ ఏసీబీ పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇతర  విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపై కూడా ఏసీబీ పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఏసీబీ, దిశ, ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలకు చోటు ఉండకూడదని తెలిపారు. మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్లతో పెకిలించేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version