Home వార్తలు సిఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడిలో సూత్రధారులు వారేనని సంచలన వ్యాఖ్యలు చేసిన బోండా...

సిఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడిలో సూత్రధారులు వారేనని సంచలన వ్యాఖ్యలు చేసిన బోండా ఉమా

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని , సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనులే సూత్రధారులని టీడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీను లు రంగం లోకి దిగారని పేర్కొన్నారు. రాయి దాడిపై సిఎం జగన్మోహన్ రెడ్డినే స్వచ్చందంగా సీబీఐ విచారణకు కోరాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం ఆటర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో కొడికత్తి డ్రామా ఆడితే …నేడు గులకరాయి డ్రామా ఆడారని విమర్శించారు. సొంత వైసిపి కార్యకర్తలే గులకరాయి దాడి పై నవ్వు కుంటున్నారని ఎద్దేవా చేశారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? సిఎం ప్రచారంలో ఉండగా విద్యుత్ ఆపమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? చీకటిలో సిఎం ప్రచారం చేయటానికి వీలు ఉందా ? బిల్డింగ్ ల పై సెక్యూరిటీ ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు.గతంలో కలకత్తా , తెలంగాణలో జరిగిన సానుభూతి ఘటనలనే ఐ ప్యాక్ టీమ్ రాష్ట్రంలో ప్రయోగిస్తుందని తెలిపారు.

వెల్లంపల్లి కంటికి గాయం ఎలా అయింది?

జగన్మోహన్ రెడ్డి కి కంటికి తగిలిన గుల కరాయి… వెల్లంపల్లి కాలి మీద పడితే ఆయన కంటికి గాయం ఎలా అయ్యంది అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి లో ఆయనకు పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ రౌడీ షీటర్లు సెంట్రల్ నియోజకవర్గం లో వచ్చి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు చేసినా పోలీసు అధికారాలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

చంద్రబాబు పై జరిగిన దాడులకు సమాధానం ఏమిటి?

నందిగామ, యర్రగొండపాలెం నియోజకవర్గలలో పర్యటించిన చంద్రబాబు మిద వైసిపి నాయకులు రాళ్ళ దాడి చేస్తే పోలీస్ యంత్రాగం ఏమీ చేసింది? వాళ్ళ మిద 324 సెక్షన్ పెట్టీ చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు సిఎంపై గులకరాయి విసిరితే హత్యాయత్నం కింద సెక్షన్ 307 పెడతారా అని నిలదీశారు. రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో నెల రోజుల లోపే సిఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి పై విచారణకు కమిటీ వేసి నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

Exit mobile version