Home వార్తలు Big Breaking: 12 మంది రెవెన్యూ సిబ్బందిపై వేటు.. త్వరలోనే మరో బాంబు..!?

Big Breaking: 12 మంది రెవెన్యూ సిబ్బందిపై వేటు.. త్వరలోనే మరో బాంబు..!?

Big Breaking: ప్రకాశం జిల్లాలో రెవెన్యూ శాఖలో అక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దృష్టి పెట్టారు. భూ అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ముగ్గురు తహశీల్దార్ లు , ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మరో 12 మంది రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

మార్కాపురం పరిధిలో ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించారన్న ఆరోపణలపై వారిపై శాఖాపరమైన విచారణ జరిపిన కలెక్టర్ అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 1 నుండి 30వ తేదీ వరకూ తహశీల్దార్ విద్యాసాగరుడు హయాంలో ఇరెగ్యులర్ మ్యుటేషన్స్ జరిగినట్లు అధికారుల విచారణలో గుర్తించారు. తహశీల్దార్ విద్యాసాగరుడు రిటైర్ కాగా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

భూ అక్రమాల్లో తహశీల్దార్ పి విద్యాసాగరుడుతో పాటు అదనపు రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ఎన్ గోపి ( వేరే కేసులో సస్పెండ్ అయ్యారు), విఆర్ఓలు ఎస్ శ్రీనివాసరెడ్డి, కే రాజేశ్వరరెడ్డి, ఎం కోటయ్య, జి శ్రీనివాస రెడ్డి, వై గోవింద రెడ్డి, ఖాసిం వలీ, వై కాశీవిశ్వేరరెడ్డి, జి సుబ్బారెడ్డి, వివి కాశి రెడ్డి, ఐ చెలమారెడ్డి, డి మస్తాన్ వలీ, ఎం రామచంద్రరావు, పి మల్లికార్జున, సర్వేయర్ ఎం విష్ణుప్రసన్న కుమార్, డేటా ఆపరేటర్ పి నాగరాజులు ఉన్నట్లు అధికారుల విచారణలో గుర్తించారు. వీరిపై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు.

ఎర్రగొండపాలెం, పొదిలి మండలాల్లోనూ భూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మండలాల్లోనూ కొందరు ఉద్యోగులు ప్రభుత్వ భూములను ఆన్ లైన్ చేశారన్న అభియోగాలపై అంతర్గత విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మండలాల్లో భూ అక్రమాలపైనా అధికారులపై చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.  

Exit mobile version