APPSC Jobs: ఏపిలో నిరుద్యోగులకు శుభవార్త అందనున్నది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. మరో వారం పదిరోజులలో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పొడగింపునకు కమిషన్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఇకపై ఉద్యోగాల భర్తీలో అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యుఎస్ కోట కింద పది శాతం రిజర్వేషన్ లు అమలు కానున్నాయి. అయితే ఈ కోటా లో భర్తీ కాని పోస్టులకు క్వారీ ఫార్వర్డ్ చేయాలా వద్దా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై క్లారిటీ కోసం ప్రభుత్వానికి ఏపిపీఎస్సీ లేఖ రాసింది. అదే విధంగా రిజర్వేషన్ కెటగిరి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పై ప్రభుత్వం నుండి స్పష్టత రాగానే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
APPSC Jobs: ఖాళీలు ఇవీ..
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) – 72
మెడికల్ ఆఫీసర్ (యునానీ) – 26
మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) – 53
లెక్చరర్ ( హోమియో) – 24
లెక్చరర్ ( డాక్టర్ ఎన్ఆర్ఎస్జీఏసీ ఆయుష్) – 3
జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ – 670
అసిస్టెంట్ ఇంజనీర్ – 190
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 (దేవాదాయశాఖ)
హార్టికల్చర్ ఆఫీసర్ – 39
తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్) – 5
డిస్ట్రిక్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – 4
ఇంగ్లీషు రిపోర్టర్ ( లెజిస్లేచర్) -10
జూనియర్ లెక్చరర్ ఏపిఆర్ఈఐ సొసైటి – 10
డిగ్రీ లెక్చరర్ ఏపిఆర్ఈఐ సొసైటి – 5
అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ సర్వీస్ – 9
రాష్ట్రంలోని వివిధ విభాగాలలో మొత్తం 1,180 పోస్టులకు గానూ నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం ఇప్పటికే జివో 48 విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుండి క్లారిటీ రాగానే నోటిఫికేషన్లు ఉంటాయని కమిషన్ వర్గాలు వెల్లడించాయి.