Home వార్తలు AP High Court: దుగ్గిరాల ఎంపిపీ ఎన్నికపై హైకోర్టు స్టే..!!

AP High Court: దుగ్గిరాల ఎంపిపీ ఎన్నికపై హైకోర్టు స్టే..!!

AP High Court: గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపిపీ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 8వ తేదీ ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉండగా ఎన్నిక వాయిదా కోరుతూ టీడీపీ ఎంపీపీ అభ్యర్ధి షేక్ జబీన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు జబీన్ కుల దృవీకరణ పత్రంపై నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఇందు కోసం వారం రోజులు హైకోర్టు గడువు ఇచ్చింది. వారం తర్వాత ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

విషయం ఏమిటంటే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా టీడీపీ 9, వైసీపీ 8, జనసేన ఒక స్థానాలు గెలిచాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఎంపీపీ పీఠం దక్కే అవకాశం ఉండటంతో చిలువూరు నుండి గెలిచిన జబీన్ ను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే జబీన్ కు కులదృవీకరణ పత్రం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. దీంతో సెప్టెంబర్ 24న ఎంపిపీ ఎన్నికకు టీడీపీ, జనసేన ఎంపీటీసీ సభ్యులు గైర్జజరయ్యారు. కోరం లేని కారణంగా సమావేశం వాయిదా పడింది ఆ తరువాత 25వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహించినా వీరు హజరుకాలేదు.

Exit mobile version